పుట:కాశీమజిలీకథలు -07.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

196

కాశీమజిలీకథలు - సప్తమభాగము

జేయఁగూడదు. వినుము. నీకులవృత్తితప్పని యతం డనలేదు. నీవు యోగ్యమైన చిత్తవృత్తిగల యొకస్త్రీని ఇష్టములేనిదే వ్యభిచారమునకు నియమించితివఁట అది యొక తప్పు సుగుణసంపన్నుఁడగు కోయబాలునిపై వస్తువులతోఁగూడఁ దన కూతు రను దీసికొని పోయెనని యసత్యాభియోగము దెచ్చితివఁట అది రెండవతప్పు ఈ యపరాధద్వయమునకై నిన్నుదయార్కుఁడు శిక్షించెను. ఇందులకు నీవేమి చెప్పెద వని అడిగిన నది యిట్లనియె.

దేవా ! భోగమువాండ్రు ఇతరజాతులబాలికల దెచ్చికొని పెంచుకొనుట వాడుకయైయున్నది. అట్లే నేనొక కూతుం బెంచుకొంటిని. దానికా కుర్రవాఁడు తివాసి సుంకువగా నిచ్చి కలసికొని మరునాఁడు మాయిల్లు దాటించెను. అందుల కై యాకోయవానిపై నిజమైన యపరాధమే మోపితిని. తివాసిని వారు తీసుకొను తలంపుతో నీశిక్ష నాకు‌ విధించిరి తండ్రీ అని మొర పెట్టుకొన్నది.

సుమేధుఁడు న్యాయవాదులతో నాయభియోగమును గురించి కొంత చర్చించి తివాసితోఁగూడ నాకోయపిల్ల వాని నిచ్చటికిఁ బంపుమని వ్రాసియుంటిమి పంపిరా? అని అడిగినఁ గ్రిందియుద్యోగి యొకపత్రికను విప్పి చదివి‌ దేవా ! పిల్లవాఁడు రాలేదు. తివాసిపంపిరి వాఁడాతివాసి నమ్మి యానాఁడే కొండలలోనికిఁ బోవుటచేతఁ బిలి పించుట కాలస్యమగుచున్నది. కొంచెము కాలవ్యవధినొసంగిన పంపఁగలను అని యుదయార్కుఁడు వ్రాసియున్నాఁడని వినిపించెను.

అప్పుడు సుమేధుఁడు, చిత్రానన మెందున్నది. తెప్పింపుఁడని అడిగిన నొక పరిచారకుఁ డాచుట్టను తీసికొని యందు విప్పి పరచెను. ఆయల్లిక, యారంగులు నాదట్టన, యామెఱుఁగు, ఆవన్నె, యాతళ్కుచూచి సుమేధుఁడు మిగుల వెరగుపడుచు నల్లిక విమర్శించి వస్తువులు వితర్కించి విప్పివిప్పి గ్రుచ్చిగ్రుచ్చి నిదానించి మఱియు మఱియుఁజూచుచుఁ బెద్దతడవుఁ దాని గుఱించియే వితర్కించుచుండెను.

కన్నులు మూసికొని యొక్కింత సేపు ధ్యానించి రత్నాంగి మొగముజూచి మృగదత్తుఁడీ రత్నాసనము తానల్లెనని నీతోఁ జెప్పెనా? యీపని తనకెవ్వరు జెప్పిరో? యడిగితివా యనిపలికిన అవ్వెలఁది దేవా! అది వాఁడల్లినమాట వాస్తవము పనియెట్లు నేరుచుకొనెనో నాతోఁ జెప్పలేదు. ఉదయార్కునితోఁ జెప్పెనేమో తెలియదని యుత్తర మిచ్చినది.

అప్పుడతండాపత్రికలన్నియు మఱలఁ జదివెను. వానిలోకోయపల్లెలో నల్లిన చాపం జూచి నాబుద్దిబలముచే నాయల్లిక నేరుచుకొంటినని చెప్పినట్లున్నది. అప్పుడు తలయూచుచు నా పుడమిరేఁడు మృగదత్తుని సాధ్యమైనంత వేగముగా నిక్కడికిఁ