పుట:కాశీమజిలీకథలు -07.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సుమేధుని కథ

195

న్నను వస్త్రధారణ మాల్యాను లేపనాది విశేషములచేఁ దొలిప్రాయమందున్నట్లు కనం బడుచుండును. రత్నాంగి యాటపాటల నంతనై పుణ్యము లేనిదైనను విటవిత్తాపహరణ మందు మంచి నేర్పుగలిగియున్నది. యువకులరంజించు వగలు, టక్కులు దానికే గలవు. విద్యానగరంబున బుష్పవేణిఅను వారకాంతయింటఁ బసజేసి దానితోఁ దన వృత్తాంతమెఱిగించి కన్నీరుగార్చుచు నిట్లనియె.

ఉదయార్కుఁడు వస్తులోభంబున నాకన్యాయముగా శిక్షవిధించెను. ఈయప రాధము మాపుకొననేని నేనాయూరిలోఁ గాపురము జేయఁజాలను. ఈసుమేధుఁ డెట్టి వాఁడో తెలియదు. నీవెప్పుడైనఁ బోయిచూచితివా? భార్యాపుత్రులు గలరా. ఎన్ని యేండ్ల వాఁడు? రసికుఁడగునా? కాడాఁయెఱింగింపుమనిఅడిగిన వినిపుష్పవేణియిట్ల నియె సుమేధుఁడు ధర్మస్వరూఁపుడని చెప్పుదురు. మిక్కిలి చక్కనివాఁడు. విహారార్థ మరుగుచుండఁ బెక్కుసారులు చూచితిని. పరస్త్రీలఁ గన్నెత్తిచూడఁడు. న్యాయా న్యాయ విమర్శనమం దతనికిఁ గలనేరుపు బృహస్పతికి లేదని చెప్పుకొనుచున్నారు. ధర్మసూక్షకము వానికే తెలియునఁట. కావున నీవు విచారింపనవసరము లేదు. న్యాయమే చేయును. మగవగ లతనిమదికిఁ దగులవు ఆశ్రయించిన బ్రయోజనములేదని చెప్పినది. కానిమ్ము మంచిమాట వింటిని ఎల్లుండి నాయపరాధము విమర్శింతురఁట. సాక్షులతో రమ్మని నాకు నాజ్ఞా పత్రికఁ బంపిరి. పరిచారిక నొకసాక్షిని దీసికొని వచ్చితిని. రెండవసాక్షివిగా నీవు‌ రావలెను. నాగౌరవము గురించియు నీతినిగురించియు నీవు జెప్పవలయను. అని బ్రతిమాలిన నది అంగీకరించినది.

నిరూపణదివసంబున రత్నాంగి యిరువుర సాక్షులతో రాజసభకుఁ బోయినది. రాజభటులు రత్నాంగీ ? అని పిలిచినతోడనే సుమేధునియెదుటకుఁ బోయి నమస్క రించినది. సుమేధుఁడు దానిం జూచి రత్నాంగివి నీవేనా? ఉదయార్కుఁడు నీపై నపరాధద్వయము నిరూపించి నీకుశిక్షవిధించెను. నీ వాయపరాధములు చేయలేదని యెట్లు చెప్పుదువు? అని అడిగిన నది యిట్లనియె.

దేవా ! నేను వారకాంతను. నాయందు వారికొక కోపము గలిగియున్నది. ఒకప్పుడు నాకువర్తమానము చేయగాఁ బోలేకపోయితిని. దేవరవా రెఱుగనిధర్మ మేమగలదు. మఱియు నేను కొన్న తివాసిని వారూరక తీసికొనిరి. వస్తులోభంబున నాయందపరాధము నిరూపించి శిక్షించిరి. దేవరవారు ధర్మస్వరూపులు. నాకుల వృత్తి ప్రకారము జేసితిని. అది తప్పని శిక్షవిధించిన మే మేమిచేయఁగలము. అని కన్నీరు గార్చుచుఁ జెప్పిన వారించుచు నతం డిట్లనియె.

నీవు అడిగినమాటకే యుత్తరము చెప్పవలయునుగాని యితర ప్రసంగము