పుట:కాశీమజిలీకథలు -07.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

194

కాశీమజిలీకథలు - సప్తమభాగము

రాధము నిరూపించితివి ఈయపరాధద్వయమునకు నీవు దండ్యురాలవు. వేయు నిష్కము లిచ్చుకొనునట్లు నీకుశిక్ష విధించితిమి. ఈయనిచో రెండేఁడులు కారాగార ములో నుండవలయు నీతివాసి తీసికొనివచ్చి వీనికిచ్చివేయవలయును. అనిమంత్రులతో నాలోచించి యారాజురత్నాంగికి శిక్షవిధించుటయుఁ దచ్ఛాసనానుసారముగా రాజ భటులు పదపదయని గెంటుచు దానివెంట దాని యింటికింబోయి శిక్షాధనముతోఁ గూడ దివాసిని తీసికొనివచ్చి రాజునకు సమర్పించిరి.

ఓహో! ఈరాజు పక్షపాతముజేసి నాకపరాధము విధించెను. తివాసి తాను దీసి కొనుటకై యింత పన్నెను. కానిమ్ము వీరితోనే యయ్యెనా యేమి? పైయధికారులు లేరా? భూమియంతయు నీతఁడొక్కఁడే పాలించుచుండెనా? పైవారియొద్దకుఁ బోయి న్యాయము బొందివచ్చెదనని నిశ్చయించి రత్నాంగి ద్రవ్యనష్టమునకు మిక్కిలి విచా రించచు నుదయార్కునిపై నధికారముగల గజేంద్రవాహనుఁడను రాజునొద్ద కఱిగి నది.

న్యాయవాదుల సహాయముమూలమున రత్నాంగి యుదయార్కుఁడు తనకుఁ గావించిన యక్రమమును గజేంద్రవాహనునకుఁ దెలియఁ జేసినది. అమ్మహారాజు అయ్యభియోగమునను విమర్శించుటకు దనకు సామంతరాజుగానున్న సుమేధునొద్దక్కి, బంపెను.

అని యెఱింగించునప్పటికి ....

128 వ మజిలీ.

సుమేధుని కథ

గజేంద్రవాహనుఁడు సామంతచక్రవర్తి. ఆపృధివీపతి యధికారముక్రింద. నేబదియార్గురు సామంతరాజులుగలరు. సామంతరాజులు చేసిన న్యాయాన్యాయముల విమర్శింప గజేంద్రవాహనునికి నధికారముగలదు. తానుచేసిన శిక్షావిధులు సమంజస ములు కావని తోచినచోఁ ద్రిప్పివేయుచుండును. ఆయభియోగమునెల్ల విమర్శించి యందలి యదార్థము లెఱింగింప మిక్కిలి బుద్ధిమంతుఁడగు సుమేధుఁడనుసామంత రాజును నియమించెను. సుమేధుఁడును గజేంద్రవావానునిచే నీయఁబడిన నూఱు గ్రామ ములు గలవాఁడగుట రాజని పిలువఁబడుచుండును. సుమేధుఁడు తెలివిగలవాఁడు. ధర్మాసక్తుండని యెఱింగియుండుటదే గజేంద్రవాహనుఁ డతఁడుచేసిన తీరుపుల విమ ర్శింపకయే స్థిరపరచుచుండును.

రత్నాంగి తన యభియోగమాసుమేధునొద్దకుఁ బంపబడినదని విని యతనిచేఁ బాలింపఁబడుచున్న విద్యానగరమునకుఁ బోయినది. రత్నాంగి మధ్యయౌవనమందు