పుట:కాశీమజిలీకథలు -07.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

25]

ఉదయార్కుని కథ

193

రత్నాంగి -- కడుపునఁ బుట్టినదికాదు. పెంచుకొంటిని

రాజు -- ఎన్ని ఏండ్లు ప్రాయమప్పుడు పెంచుకొంటివి?

రత్నాంగి -- వివరము జ్ఞాపకములేదు. ఏడెనిమిదేండ్లయినది.

రాజు - దాని తలిదండ్రు లెవరు?

రత్నాంగి - (ఇంచుకయాలోచించి) ఎవ్వరోనాకుఁదెలియదు.

రాజు - మఱియెక్కడనుండి తీసికొని వచ్చితివి?

రత్నాంగి -- వీధిఁబడి పోవుచుండఁ బిలిచి అన్న వస్త్రము లిచ్చి పోషించు చంటిని.

రాజు - దానికి వివాహమైనదేమొ యెఱుగుదువా?

రత్నాంగి -- ఎరుఁగను.

రాజు -- ఎప్పుడును అడుగలేదా?

రత్నా - వట్టి వెర్రిదిబాబూ! ఏమాటయుం దెలియదు. చెప్పినపని మాత్రము చేయుచుండునది.

రాజ - అంతకుమున్నెన్నఁడైన లంజరికమునకు నియమించితివా?

రత్నా - లేదు. లేదు. దానియవసరము లేకపోయినది. నిన్న నాయొడలిలో స్థిమితములేమింజేసి దానిం బంపవలసి వచ్చినది.

రాజు - అలంకరించియే పంపితివా?

రత్నా - అయ్యో? పదివేలు విలువఁగలనగలచేనలంకరించితిని.

మృగదత్తుఁడు -- లేదు సామి లేదు. ఒక్క నగయైన లేదు. మాసినగుడ్డ కట్టు కొన్నది. మూలఁ గూర్చున్నది. వెర్రిదిగాదు. ఏలాటి పురాణములు సెప్పినదను కొంటిరి?

రాజు - వీనిమాట యసత్యమా? అది సింగారించుకొనఁగా నీవు జూచితివా! నిదానించి చెప్పము.

రత్నాంగి - నాకు జ్వరముగా నుండుటచేఁ బరిశీలింపలేదు. అలంకరించుకొని పొమ్మని తెప్పితిని.

రాజు - నీవీపత్రికలోఁ బదివేల వెలగల నగలతోఁ దీసికొని పోయెనని వ్రాయించితివిగదా? చూడక యెట్లు వ్రాయించితివి.

రత్నాంగి -- (భయపడుచు) నగలు ధరించినదని తలంచి యట్లువ్రాసితిని.

రాజు - నీమాటలలోఁ బరస్పరవిరుద్దములు చాలగలవు. నీవు చెప్పుచున్నవి అంతయు నసత్యము. ఉత్తమాంగనను జెడుకార్యమునకు నియోగించితివి. లేనియప