పుట:కాశీమజిలీకథలు -07.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉదయార్కుని కథ

191

మృగ -- (సిగ్గుచే తలవాల్చుకొని) ఏమో తెలియదు.

రాజు - తెలిసినది విటుండవై యరిగితివికాబోలు ప్రతిఫలము ముట్టఁజెప్పక పోవదే.

మృగ - లేదు సామి లేదు.

రాజు - లేకున్న నిజము చెప్పము తప్పున్న దానిందడించితిరిగి తెప్పెందె దను.

అనిరాజు వానితో సంభాషించుచున్న సమయంబున రత్నాంగి అచ్చటికి వచ్చి నమస్కరింపుచు నపరాధనిరూపణ పత్రిక యొకటి రాజునకర్పించినది. వాచ కుఁజు దాని నిట్లు చదువుచున్నాడు.

మహారాజా ! నిన్నరాత్రి చిరుతపులిఅను కోయవాఁడు మాయింటికి విటధర్మ మున నరగుదెంచి తానల్లిన తివాసి నొకటి యిచ్చి నాకూఁతురను భోగినిగా నభిల షించి రాత్రి మాయింటఁ బండుకొని తెల్లవారకమున్ను సకాలాలంకార భూషితయగు నాయోషామణిం దీసికొనిపోయెను. ఎందుదాచెనో తెలియదు ప్రొద్దుటనుండి వెదకించు చుంటి దేవరవారు కటాక్షించి వాని దండిచి నాపుత్రిక నిప్పింపఁ బ్రార్దించుచున్న దాన. అని చదివెను.

ఆపత్రికా వృత్తాంతము విని రాజు మిక్కిలి వెరగుపడుచునోహో! చిరుత పులి నీకూతునెత్తికొనిపోయెనా అందులకు మేమేమి చేయుదుము భక్షించియుండు నేమో యని పరిహాసమాడుచు నోరీమృగదత్తా! యిట్టి తివాసులల్లువాండ్రు మీలోఁ బెక్కురుగలరాయేమి యని యడిగిన వాఁడు స్వామీ! నాకుఁగాక యీపని మఱి యొకరికిఁ దెలియదని చెప్పెను.

మహాప్రభూ ! వీఁడే రాత్రిమాయింటికివచ్చి నన్ను మోసముజేసి నాకూఁతు నెత్తికొనిపోయిన మ్రుచ్చు అని‌ రత్నాంగి పలికినది. వీనిపేరు చిరుతపులియా? మృగదత్తుడా ! అని రాజడుగఁ జిరుతపులియని నాతోఁజెప్పెనని రత్నాంగి చెప్పినది.

రాజు వాని మొగముజూచి మృగదత్తా! నీకు రెండుపేరులు గలవాయేమి? నిజమైన పేరేది యనుఁడు నాకు మొదటిపేరులు చిరుతపులియేకాని తరువాత మృగ దత్తుఁడని చెప్పుకొనుచున్నాను. దానికి వేరొకకారణఁమున్నదని చెప్పెను.

అప్పుడురాజు మిగుల వింతగాఁజూచుచు నీవీరత్నాంగిమాటలు వింటివా? దానికూతు నెత్తుకొనివచ్చితివఁట యేమిటికి? నిజము చెప్పుమని అడిగిన వాఁడు రామ రామ నేనేమియు నెరుఁగను అది బొంకుచున్నదని చెప్పెను. అడవివాండ్రు అసత్య ములాడరు నీవేబొంకుచుంటివి. వీని తివాసి న్యాయముగా హరించితివఁట. తీసికొని