పుట:కాశీమజిలీకథలు -07.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

190

కాశీమజిలీకథలు - సప్తమభాగము

తివా? పదపద. రాజుగారు నిన్నుఁదీసుకొని రమ్మనిరని చెప్పి అప్పుడే వాని రాజ సభకుఁ దోడ్కొనిపోయిరి.

మృగదత్తుని దేహచ్ఛాయ నలుపైనను నింద్రనీలమువలె మెఱయుచుండును. కన్నులు ఆకర్ణాంత విశాలములై యున్నవి. వెడదయురము ఎగుబుజంబులు దీర్ఘ బాహులుం గలిగి యొప్పుటంజేసి వానిరూపు చూచినవారి కచ్చెరువు గొలుపక మానదు. మఱియు గోయకులంబునం బుట్టినవాఁడగుట వింతగా వానింజూడక మానరు. ఉదయార్కుఁడు నిండుకొల్వుండఁగా వాని రాజభటు లతనియొద్దకుఁ దీసి కొనిపోయి యెఱింగించిరి.

రాజువానింజూచి వెరగుపడుచు వీఁడు కోయవాఁడా? ఔరా? యెంతవిచిత్రము. అనిపలికి వానింజాచి.

రాజు - ఓరీ! నీపేరేమి?

మృగ -- మృగదత్తుఁడండ్రుసామీ!

రాజు - వింత తివాసులనల్లినవాఁడవు నీవేనా?

మృగ - నేనే సామి

రాజు - ఈపని నెక్కడ నేర్చుకొంటివి?

మృగ -- నాకెవ్వరును నేరుపలేదు. నాబుద్దిబలముచేతనూహించి. అల్లితిని సామి.

రాజు - నీవు చదివికొంటివా?

మృగ - లేదు. సామి లేదు.

రాజు - ఏమిటికి నేర్చుకొనవై తివి.

మృగ -- చెప్పువారులేక సామి!

రాజు - నీవు తరుచు ఎందువసింతువు?

మృగ - కొండలనడుమ సామి

రాజు - నీతలిదండ్రు లిక్కడకువచ్చిరా?

మృగ - లేదు సామి‌ లేదు.

రాజు - నిన్న నద్భుతమైన తివాసి తెచ్చితిఁవట యేమిచేసితివి?

మృగ - రత్నాంగియను బోగముది తీసికొన్నదిసామి.

రాజు -- ఏమి వెలయిచ్చినది?

మృగ - ఏమియు నీయలేదుస్వామి! యూరకయే హరించినది.

రాజు - ఏమికతన?