పుట:కాశీమజిలీకథలు -07.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉదయార్కుని కథ

189

పద్మిని కించుకయు వేడి సోకినదికాదు. బూడిదరాచిన రత్నమువలె మెఱయు చుఁ జెక్కుజెదరక లేచి నలుమూలలు జూచి అయ్యో? నన్ను దైవము జంపకున్నాడు గదా? ఇంక నెన్నియిడుములు గుడువఁ జేయుటకో యని తలంచుచుఁ బోయి పోయి కొన్ని దినంబుల కందొక గొల్లపల్లి చేరినది.

అప్పటికి మరల బుద్దిస్వాస్థ్యము తప్పుటచే అందొక గొల్లవాని యింటిలో వాఁడు చెప్పిన పనులుచేయుచుఁ గొన్నిదినములు కాలయాపనము చేసినది.

అని యెఱింగించి,

127 వ మజిలీ

ఉదయార్కునికథ

ఆహా? ఆమె యెవ్వతెయో కానీ చాలమంచిది ఆమెచెప్పిన మాటలు నాడెంద మున బాగుగ నాటినవి. నేనీ బోగముదానియింటికి వచ్చుట తప్పుగా ఎఱుఁగక మోస పోయితినిగదా? మిక్కిలి వెలగలతినాసి‌ గోలుపోయినను మంచిమాటలువినంబడినవి. అదియొకమేలే? మఱియు నేనుత్తమకులసంజాతుఁడనట. ఈజాబు రామదుర్గనగరంబు నకుఁదీసికొనిపొమ్మని చెప్పినదిగదా? దీనివలనఁగొంతలాభము గలుగఁ గలదు అయ్యా ! నాకుఁ జదువురాకపోవుటచే నిందేమివ్రాయబడినదో తెలియఁబడదు. ఒరు లకుఁ జూపవలదనిజెప్పినది. కానిమ్ము ముందుగాఁ జదువు నేర్చికొని యీయుత్తరము జదివికొనిన తరువాత బోయెద నిఁక నీకోయల సహవాసము విడిచెదనని తలంచుచు మృగదత్తుఁడు వేశ్యాగృహము వెడలి కనుచీఁకటి యుండఁగనే యూరిబయటనున్న గుడిసెలయొద్దకుఁబోయెను.

అందున్న కోయలు వానింజూచి యోరీ చిరతపులీ? నీవురాత్రి యెందుబోయి తివి? నీకొఱకుఁ బురమంతయు వెదకితిమి. తివాసినమ్మితివా? మనతివాసులు చూచి రాజుగారు మెచ్చికొని నిన్నుఁదీసికొని రమ్మనిరఁట. పెద్దతివాసి తామే కొనియెద రఁట. రాజభటులు పలుమారువచ్చి పోవుచున్నారు నీ అదృష్టము మంచిదాని వాండ్రు పలికిన విని అతండు నన్నుఁ బులియని పిలువవలదు నాపేరు మృగదత్తుఁడని పిలువుఁడు పెద్దతివాసి నమ్మితిని. రాత్రియెందో పోయితినని పలుకుచుండఁగనే రాజభటులు కొందఱువచ్చి తివాసులల్లిన పిల్లవాఁడు వచ్చెనా? అని కేకలు పెట్టిరి.

వచ్చెనని చెంచులు కొందరుత్తరము చెప్పిరి నేనే అల్లినవాఁడను అని మృగ దత్తుఁడు ముందరకువచ్చి నిలువంబడుటయు రాజభటులువానింజూచి నీనిమిత్తము రాతిరినుండి తిరుగుచుంటిమి. ఎందుబోయితివిబాబూ ! పెద్దతివాసియున్నదా! అమ్మి