పుట:కాశీమజిలీకథలు -07.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24]

మృగదత్తుని కథ

185

వృత్తాంత మరసెదంగాక. ఈలంజపడఁతి యింటనుండ దుష్టక్రియలకు బ్రేరేప కుండునా? ఇందుండుట నాతప్పు కానిమ్ము రేపే మఱియొక చోటికిం బోయెదనని తలంచి దానికేమియు సమాధానము జెప్పక యూరక యాయాస్తరణవై చిత్ర్యము చూచుచుండెను.

అమృత్తకాశిని మెత్తబడినదని తెలిసికొని రత్నాంగి బోఁటీ ఇటురా ? అదిగో యా పెట్టైలో నగలున్నవి ధరింపుము. ఆచీరగట్టుము. ఆరవికెతొడుగుము. మేడ మీఁది గదిలోనికింబొమ్ము. తలదువ్వుకొనుము హారములు దాల్చుము. చమత్కార ముగా మాట్లాడుము. వేడుక గలిగింపుము లేనివలపు లేనిప్రీతి బ్రకటింపుము అని వేశ్యా ధర్మములన్నియు బోధించినది.

పద్మిని యాపలుకులు వినక యలంకరించుకొనక యా వెర్రివేషముతోనే మేడ మీఁదిగదిలోనికిబోయినది. రత్నాంగి జ్వరపీడిత యగుట నంతగా విమర్శించి నదికాదు. అంతలోఁ చెంచుపట్టి కాశకోకజుట్టి తలరుమాలుబిగించి యందుఁ బిగిలి పిట్టరెక్కల కుచ్చుజొనిపి వెండి మొలత్రాడు మురుగులు వింతఅందము తేరనొయ్యా రముగా నడుచుచు రత్నాంగి యింటికి వచ్చెను.

అంతకుముందు ద్వారమున వాని నిమిత్తము వేచియున్న దూతిక వానినా మేడమీఁదికిఁ దీసికొనిపోయినది అతండా గదిలోఁ బ్రవేశించి నలుమూలలు సూచి యొకమూలనొదిగియున్న పద్మినిం జూచి తలయూచుచు నందొక పీఠముపైఁ గూర్చుండెను.

పద్మిని వాని యాకారము చూచి మొగమునందు గురుదత్తుని చిహ్నములుం డుటఁ బరిశీలించి యొడలు ఝల్లుమని పాలుచేపురా వానితో నిట్లు మాట్లాడినది.

పద్మిని - బాలుఁడా ? నీకులమెయ్యది ? తలిదండ్రులెవ్వరు? కాపురమెచ్చటఁ ఇచ్చటికెప్పుడు వచ్చితివి ?

చిరుతపులి -- నీవెవ్వతెవు సాయంకాలమున నాతో మాటాడిన బోగముదానవు కావా ?

పద్మిని - అప్పా ! అది యిప్పుడే రాఁగలదు. నామాటల కుత్తరమిమ్ము.

చిరు - మేము చెంచువాండ్రము. మాదికోయపల్లె కాపురము. నాకుఁదల్లి లేదు. దండ్రి చెంచుఁడు. చాపలమ్ముటకై మొన్ననీయూరు వచ్చితిమి ! నా పేరు చిరుత

పద్మిని - ఈ తివాసి నెవరల్లినది.

చిరు - నేనే అల్లితిని.