పుట:కాశీమజిలీకథలు -07.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మృగదత్తుని కథ

183

కఱిగి యూరిబయటఁ గుటీరములఁబన్ని గాడిదలపైనున్న వస్తువులందింపి గ్రామము లోని కమ్మగమునకుఁ దీసికొనిపోయెను.

దేనికెంత వెలవేయవలయునో తెలియక తక్కువవెల వేయుటచే నొక యామ ములో నావస్తువులన్నియు నమ్మకమైనవి. ఆవస్తువులఁ గొనుటకై ప్రజలు కోలాహల ముగా గుమిగూడి వచ్చుటఁ జూచి యాబాలుండు గ్రమంబున నావస్తువుల దరలు హెచ్చు చెప్పుచుండెను. అట్లే అమ్మకమైనవి చివరకు నొకవింతయగు నాస్తరణము మిగిలియున్నది. అది మిక్కిలి కష్టపడి మంచి వస్తువులతో వింతగా నల్లఁబడినది ప్రజల యాతురతఁజాచి యాతివాసి వెల వెనుకటి‌ వానికంటె బదిరెట్లెక్కువ జెప్పు టచే నెవ్వరు కొనలేకపోయిరి. రత్నాంగి అను వేశ్యారత్నము చక్కగా నలంకరించు కొని నాఁటి సాయంకాలమున జిరుతపులి అల్లిన రత్నకంబళము తెరగు పరిచారిక వలనఁ దెలిసికొని వానిం దీసికొనిరమ్మనిపంపి తాను తన మేడవీధియరుగుపై నిలువం బడెను. ఇంతలో నాపరిచారిక యక్కిరాత కమారునిం దీసికొని అచ్చటికి వచ్చినది.

వానింజూచి యావెలయాలు విస్మయమందుచు నౌరా ! వీఁడెక్కడికోయవాఁడు ఆటవిక వేషముతోనున్న వీనిసౌందర్యము ఆసేననకంబై యొప్పుచున్నదిగదా! కానిమ్ము వీని‌ వలపులం జిక్కజేసి‌ టక్కరితనంబున నీతివాసి వెలయీయకయే లాగి వేసెదనని తలంచి వాని తనమేడకుఁ దీసికొనిపోయినది. అందలి వింతలన్నియు జూపి నది. చిట్టకములదే వానిమనసు గరగఁజేసినది. వ్రేళ్ళు వానిబుగ్గలపై విరచి యోహో? గట్టిమనసువాఁడవే లేకున్న నావ్రేళ్లు చప్పుడుకాకుండునా ? ఏదీ నీకంబళము విప్పి చూపుము. అని పలికినవాఁడు ముసి ముసి నగవులు నవ్వుచు దాని లీలలకు లోబడి దానింబరచి చూపెను.

కడు మృదువై పలురంగులతో నొప్పుచు మసృణంబై రత్నప్రభలవలె వెలుగుచున్న యాయాస్తరణం జూచి తలయూచుచు రత్నాంగి‌ బాపురే? సొగసు కాఁడా? యిది యెవ్వరల్లిరి? దీని వెలయెంత చెప్పుమని అడిగిన వాఁడు నేనే యల్లి తిని. ఒరులల్లినది నేనేలతెత్తును దీని వెల నూరుమాడలని చెప్పెను.

బాలుఁడా ? మే మెవ్వరమో యెఱుఁగుదువా ? వెలయాండ్రము. మేమొరులకు వెల యియ్యము అన మఱియేమిత్తువని అతం డడిగెను. ఏమి కావలసినను నియ్య గలము. నీకేది యభీష్టమో అదియే తీసికొనుము అని నవ్వుచు నుత్తరము చెప్పి నది.

నాకు నీవు కావలయునని అతండనిన అందులకు సంసిద్ధురాలనై యుంటి. నిది యిందుంచి రాత్రి రమ్ము అని పలుకుచు జేయిపట్టుకొని మెటికలు విఱిచినది.