పుట:కాశీమజిలీకథలు -07.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

168

కాశీమజిలీకథలు - సప్తమభాగము

నాలుగు దినములలోరమ్ము ఉపాయము చెవ్పెదను నామగడనుమానము గల వాఁడు తరచు రావలదు అను మాటలు చెవినిఁ బడినంత నతండత్యంత చింతా క్రాంత స్వాంతుండై యిట్లుతలంచెను.

ఆహా ! స్త్రీల చేష్టితములు పలుమారు చదివియు నేల మోసపోవుచున్నాను.


అ. పడఁతినొక్కదాని విడిచి యించుట యమృ
    తంబులేదు భువి విష౦బు లేదు
    అమృతలత లతాంగి యనురాగ వతియైనఁ
    గాక మెలఁగెనేని గరళవల్లి

రాజు దీనిఁజూచి మోహించి దూతికలుఁ బంపెను. దూతిక కిట్లు చెప్పినది. ఇక దీనిం బతివ్రతగా నెట్లు నమ్మదగినది. అయ్యో పద్మినీజాతి యువతి మంత్రౌ షధములకు వశవర్తినికాదు మహా పతివ్రత యగునని కొక్కోకుఁడు చెప్పినమాట నమ్మిదీనిం బెండ్లియాడితిని దీని కపట ప్రేమలన్నియు యధార్థములని సంతసిం చుచుఁ దల్లిదండ్రుల జూడక యిందే పడియుంటిని. నావంటి మూర్ఖుఁ డెందునులేడు. తరుచు చదువుకొన్న స్త్రీలకే తెలివిగల వనితలకే చాతుర్యముగల పొలఁతులకే శృంగారలీలలయం దభిలాషగలిగి యుండును. మగవాండ్రు అట్టి పొలంతులు పన్నిన వ్యూహములోఁ బడిపోవుదురు. సామాన్య కన్యం బెండ్లి యాడిన నాకీ ముప్పు రాకపోయెడిది? ఈచెడి పె కథవినిన మాగ్రామవాస్తవ్యులెల్ల నవ్వుదురు. గదాధరుఁ డింటికిఁబోయి యింకను రాడయ్యెను. ఇప్పుడేమిచేయఁదగినది. చెప్పకుండలేచి పోవు దునా? కానిమ్ము నాలుగు దినములలో నది మరల వచ్చునుగదా? అప్పటి సంభాష ణము విని యుక్తానుసారము గావించెదనని యోచించి తత్సమయ మరయుచుండెను.

గోమిని రాజునొద్దకుఁబోయి మొగమున సంతసము వెల్లివిరియదేవా? నీయ భీష్టము దీరినది పద్మిని వశవర్తినియైనది కరటునిఁ బన్నిదములో గెలిచితిని అని సంక్షేపముగాఁ జెప్పుటయు నుబ్బుచు నతడు ఆహా ! అమృతబిందువులవలె నీపలు కులు నాచెవింబడినవిగదా? ఎట్లు వశవర్తినియైనది? ఏమన్నది ? చెప్పుము చెప్పుము. ఇదిగో ముందుగా నీకుఁ బారితోషికముగాఁ గడియ మిచ్చుచుంటినని పలికి యవ్వలయ మిచ్చుటయు నది యిట్లనియె.

దేవా ! నేనెంత శ్రమపడితిననుకొంటిరి. అబ్బా ! అదికడు జాణ విరహవేదనచేఁ గొట్టికొనుచుండియు గుట్టు తెలియనిచ్చినది కాదుగదా! నేనన్యాపదేశముగా మాట్లాడ నదియు నట్లే యుత్తరము జెప్పినది. సందేశము వెల్లడించిన ననుమోదించినది చేతిఁ జిక్కినది. తిరుగారమ్మన్నదని పలికిన నాతఁడిట్లనయె.