పుట:కాశీమజిలీకథలు -07.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గోమిని కథ

167

ఆదూతయు నిర్భయముగా నఱిగి కబురుసేయకయే పద్మినియున్న మేడకుం బోయు నాతీ! నీతో నొక రహస్యము చెప్పవలసియున్నది. యిటు రమ్మనిపలికినఁ బద్మిని చాలుఁ జాలు నీరహస్యములు నాకవసరములేదు. నీవు మాయింటికి దరుచు రావలదని చెప్పలేదా? మఱల నేమిటికి వచ్చితి వనవుఁడు నది తల్లీ! నీవు నాపైనఁ గోపింప నక్కరలేదు. ఇదియే కడపటిసందేశము. వినుము ఇఁక దాచనేల? ఆ రాజ పుత్రుఁడు నిన్ను వరించియున్నవాఁడు నీమీఁది మోహంబున నిద్రాహారములులేక కృశించి రాత్రింబగళ్ళు పరితపించుచున్నాడు. ఆతనియాపద దాటింతువేని స్త్రీలలో నీవంటి అదృష్టవంతురాలెందును లేదు. నీవతనింగూడిన నింద్రభోగము లనుభవింపఁ గలవు కాదంటివేని -


ఉ. నీదగుతల్లిఁ దండ్రి మగనిస్మరిఁగల్గిన బంధుకోటి మ
     ర్యాద యొకింతఁ జూడక రయంబున బద్దులఁజేసి మాన వి
     త్తాదికముల్‌ హరించి నినునందఱుఁ జూడఁగఁ బట్టితెచ్చి స
     మ్మోదముతోడఁ గూడునునృపుండెవ రడ్డమొచూతుమత్తరిన్‌.

మీకులంబునకెల్ల నీకతంబున ముప్పు వాటిల్లగలదని పలికినవిని అక్కలికి యులికిపడి యయ్యొడయం డట్టివాఁడు గాఁదలంచి యొక్కింత చింతించి చిఱునవ్వొ లయ నల్లన నిట్లనియె.

గోమినీ యింతదనుక భూపతి హృదయాశమేమిటికి వెల్లడించితివికావు? నీవు సందిగ్ధముగాఁ జెప్పుచుండ నెఱింగియునట్లే యుత్తరము జెప్పుచుంటిని. రాజుకోరిన సమ్మతింపని వెంగలి యెందైనంగలదా ? సిరివచ్చుండ మోకాలడ్డు పెట్టుదురా? నీగడు సుతనంబంతయు నాయెడఁ గనపరచిన హృదయమిచ్చితినికాను నేఁడు వెల్లడిదచితివి. కావున నంగీకరించితిని. నేను మగనాలినిగదా? నామగఁ డనుమానముగలవాఁడు సతతము నింటనేయుండును నీవు పలుమారు వచ్చుచుండ శంకించుచున్నాఁడు. రాజుతోఁగలిసికొనుట సామాన్యమా? మంచియుపాయ మాలోచింపవలయును. కావున నీవు నాలుగుదినములుండిరమ్ము ఉపాయము చెప్పెదనని నొడివిన విని యత్యంతసంతోషముతో దూతిక యానాతివీపు తట్టుచు నీవు మంచిజాణవగుదువు మెచ్చికొంటి నీచిత్తము దెలిసికొనలేక పోయితిని నీవు చెప్పిననాఁడే వచ్చెదనని పలు కుచు దీవించి రాజునొద్ద కఱిగినది.

గురుదత్తుఁడు రాజు తన యింటికి వచ్చుటయు దూతికను బంపుచుండుటయు లోనగు విషయములన్నియుఁ బరిశీలించి యానాఁడు గోమినియుఁ దన భార్యయు మాటలాడుచుండ గదిలోనుండి చెవియొగ్గి వినెను. యించుకదూరమగుటఁ గొన్ని మాటలు మాత్రమే వినంబడినవి.