పుట:కాశీమజిలీకథలు -07.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

21]

సురూపుని కథ

161

అమ్మగువమొగము కన్నులకుఁ గట్టినట్లున్నది. అప్పటినుండియు నేమియుం దోచదు. నిద్రపట్టదు. ఆహారము రుచింపదు. నీకొఱకెన్నియో వార్తల నంపితిని. తరువాతి కృత్య మాలోచింపుము. ఇదియే చింతాకారణమని పలికిన విని యాదూతికి యిట్లనియె.

దేవరవారి అభిలాష సమంజసమైనదియే కాని యామానవతి యున్న గృహ మైన గుఱుతు జూచితిరికారు. ఈవీటిలో నే నెఱుంగనిబోఁటి యెవ్వతెగలదు. పేరు దెలిసినఁదృటిలో మీగౌఁగిటలో జేర్పించెద నావీధియైన జ్ఞాపకమున్నదియా? అని అడిగిన ఆతండు నాకేమియుందెలియదు. వీధిమాటగాకయా దిక్కు గూడఁజెప్పఁజాల నని యుత్తరమిచ్చెను.

అప్పుడా గోమిని యించుక సేపాలోచించి అతనిచెవులోనేదియో చెప్పినది. దానియుపాయమున కతండు మిగుల సంతసించుచు నప్పుడే ప్రధానమంత్రిని రప్పించి సచివోత్తమా! మనము మొన్న నొక పొరపాటుపని జేసితిమి. విజయదశమినాఁడు హరిహరుల నిరువుర నూరేగింపక హరికి మాత్రమే యుత్సవము జేసితిమి. దానం గోపించి భక్తసులభుండగు శంభుండు నాకలలోవచ్చి నన్నవమానపరచెదవా? యని యేమేమో ముచ్చటించి పోయెను.

దేవతా ద్రోహములనఁ బ్రమాదము రాకమానదు. కావున రేపటి సోమ వారము రాత్రి శంకరునకు వెనుకటికన్న గొప్ప యారేగింపు టుత్సవము జేయింప వలయును. మొన్న నేయేవీధులకుఁ ద్రిప్పిరో యాయా వీధులకుఁ దప్పక పోవలయు. మేళతాళములు మిక్కుటముగా నుండవలయునని చేయవలసిన కృత్యములన్నియుఁ బెద్దగా బోధించెను. మంత్రియు రాజాజ్ఞానుసారముగా సర్వము సంసిద్ధము గావించెను.

నాఁటిఱేయి నారాజకుమారుండు చక్కగా అలంకరించుకొని భద్రదంతావళ ముపై అధిష్టించి గోమినినిఁ దన ప్రక్కనుండ నియమించి యామించుఁబోణి మాటలే చెప్పచు నూరేగింపుతోఁ బోవుచుండెను.

స్వామిరథము ముంగలఁ బల్లకియుఁ బల్లకి ముంగలఁ దనయేనుఁగయు, దాని మ్రోలబోగము మేళము, తరువాత భజనలు, పైనగోపులు పిమ్మట వేణువీణాది గాన విశేషములు నడుచునట్లు నియమించెను. తనయేనుఁగ కదలుదనుక అందఱు నిలువవలయునని నిరూపించెను.

అతండుఁ మేడలుగలచోట్లఁ బెద్దతడవు నిలుపుచుండు. హారతులిచ్చు స్త్రీల నిరూపించి చూచుచుండును. ఆ రీతి రెండు యామముల దనుకఁ బోవునంత నొక