పుట:కాశీమజిలీకథలు -07.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సురూపుని కథ

159

విబుధేంద్రా? గురుదత్తుండు భాగ్యంబున మహేంద్రుం దిరస్కరించువాఁడని లోకమెఱింగినదియే. అది యట్లుండె విద్యారూపశీలంబుల ననవద్యుండగుట మాపద్మిని వరించినది. జగన్మిత్రుండగు నితనిబద్మిని వరించుట యబ్బురముగాదు. మరియొక కోరిక మిమ్ముఁ గోరుచుంటిమి వినుండు. ఈవైశ్యునకు లేక లేక పద్మిని యొక్కతియే పుట్టినది. దానివిడిచి యీదంపతులుక్షణము జీవింపలేరు. గురుదత్తుండు బద్మినిం బెండ్లి యాడి యిందే యీ భాగ్యముననుభవించు చుండవలయును. ఇందుల కంగీకరింపుఁడు శుభముహూర్తము నిశ్చయింతమని పలికినవిని గదాధరుఁడు గరుదత్తు మొగము జూచెను.

అత౦డెట్లైన నక్యన్యకారత్నము హృదయమున నిడుకొనుటకు వేగిరపడు చున్న కతంబున నంగీకారము సూచించెసు. అంతలోఁ బద్మినివచ్చి లజ్జావిభ్రమలోల దృష్టిప్రాసారముల నతని జూచుచు గురుదత్తు మెడలోఁ బుష్పదామంబు వైచినది.

అప్పుడు కుముదాంగదుండు మిగుల సంతసించచు దన్నుగృతకృత్యునిగాఁ దలంచుకొని గదాధరుని స్తుతియించుచు నప్పుడు శుభముహూర్తము నిశ్చయింపఁజేసి రత్నాకరునికిఁ దెలుపకయే మహావైభవముతోఁ బద్మినిని గురుదత్తునికిచ్చి వివాహము గావించెను.

గురుదత్తుండాడిన మాటవడువున వెండియు నింటికింబోక యందేయుండి సమారూఢ యౌవనయైన పద్మినితోఁ గూడికొని యసమకుసుమశరక్రీడా పరతం త్రుండై యౌవనలాభంబు సాద్గుణ్యము నొందఁజేయుచుండెను.

అని యెఱింగించి మణిసిద్ధుండు వేళయతిక్రమించుటయు నవ్వలికథ పైమజిలీయం డిట్ల ని చెవ్పదొడంగెను.

123 వ మజిలీ కథ

సురూపుని కథ

దుర్గానగరంబు సుప్రసిద్ద పట్టణములలో నొకటి. ఆదేశంబున కదియే రాజ ధాని. సురూపుండను రాజకుమారుం డాదేశాధిపతియై ప్రజల బాలింపుచుండెను. పట్ట భద్రుండైన కొలది కాలమునకే రూపమదము, యౌవనమదము, విద్యామదము రాజ్య మదమునుం గలసి యతనిచిత్తమును విపరీత క్రియాయత్తము గావించినది. సప్త వ్యసనములలో మొదటివి నాలుగును వానికి నిత్యకృత్యములయ్యెను.

శ్రోత్రియుల మన్నింపఁడు. విద్వాంసుల దూషించును. మంత్రులనిరాక రించును. విటుల గౌరవించును. జూదరుల నాదరించును. మద్యవులఁ జేరదీయును. పరాంగనానంగమమున రావణుని మించినవాఁడని వాడుక బడసెను. రూపవతియగు