పుట:కాశీమజిలీకథలు -07.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గురుదత్తునికథ

157

అతని‌ యుపన్యాసమును విని తుది మొదలు తెలియక తెల తల పోవుచున్న యాయాచార్యుని పక్ష మవలంబించి గురుదత్తుఁడు గదాధరుని యుక్తులగొన్ని ఖండిం చుచు నుపన్యసించుటయు నాయిరువురకుఁ గొంత ప్రసంగము జరిగినది. ఆ ప్రసంగ మందు వారి. కళాప్రవీణతయంతయు వెల్లడియగటయు లోపలినుండి వినుచున్న పద్మిని విద్యాభిలాషిణియగుట నక్కజమందుడెందముతో గవాక్షమునుండి తొంగి చూచి గురుదత్తుని విద్యా ప్రౌఢిమయు రూపసంపత్తియుఁ దనచిత్తమును సంకల్పశతా యత్తమును గావింప నానందపరవశయై ధ్యాన నిశ్చలదృష్టియై పరికింపుచుండెను.

ఆచార్యులును దదీయ నిరవద్య విద్యావావదూకత్వమున కబ్బురముజెందుచుఁ జేతులు జోడించి కోవిద వసంతులారా? మీ ప్రాయంబు కడుచిన్నది. మీకళాపాట వంబు దుర్మదబుథహృదయ పాటవంబు గావింపుచున్నది గదా మీదేయూరు ? ఇందుల కేమిటి కరుదెంచితరి. మీకులశీలనామంబు లెఱింగించి నాకుశ్రోత్రపర్వముగావింపుదురా? అని అడిగిన గదాధరుండు తమకథ యెఱింగించి యీ వైశ్యపుత్త్రికారత్నంబు విచిత్ర కళా కళాపదీపితయని జను లనుకొనవిని స్వకులాభివృద్ధి నభిలషించువాఁడ గుటంజేసి మాగురుదత్తుండు మీపద్మినితో ముచ్చటింప నిచ్చగలిగి యిందు వచ్చిన వాఁడు అచిన్నది మీశిష్యురాలేకదా? విద్యాకరగ్రహణలాలసయని వింటిమే? ఈతం డును విద్యాకరగ్రహణలాలసుఁడే కావున నాపూవుఁబోణిని౦దు రప్పింపుఁడు ఇరువురు నొకసారి మచ్చటింతురు. అని పలికిన విని యగ్గురు వరుండెంతేని సంతసించుచు అమ్మా  ! పద్మినీ! యిటురా!. నీ హృదయాభిలాష తీరగలదు. నేఁటికి నీవు గోరిన పండితవరుండు లభించె వచ్చి ముచ్చటింపుమని పిలిచెను.

పద్మినియు నగ్గురుడిచ్చిన సమాధానవచనంబులకు నిచ్చిమెచ్చుకొనుచు నల్లన గుమ్మము దాపునకువచ్చి గురువరా! వారుశ్లేషకవులు వారితో మనము ముచ్చటింపఁ గలమా? తనహాశ్లేష గంభనముల కలరని బేలలుందురా? వారియాశయగ్రహణాభిలాష నాకు మిక్కిలి గలిగియున్నది. విభుధవరప్రసాదంబునంగాని యదిసిద్దించునేయని యుత్తరంబిచ్చినది. అప్పుడు గదాధరుఁడు కుమారీ ! నీసుముఖత్వంబితనికి హృదయ గమంబైనది. నీవు వీరితో ముచ్చటించుచు సిగ్గుపడుచున్నట్లుతోచుచున్నది. కానిమ్ము పోయివత్తు మనుజ్ఞ యిమ్ము. మీ తండ్రివచ్చిన పిదప మఱల వత్తుమనుటయు నాచి న్నది గదాధరునకు నమస్కరింపుచు నార్యా ! మాతండ్రి వచ్చువేళయైనది మీరువచ్చిన కార్యంబేదియో అతని కెఱి గించినఁ దీర్పఁగలఁడు నేను జిన్నదానను నాకేమియుం దెలియదు. అదియునుంగాక మీసహాధ్యాయులు మావారుగదా? వారిందే కుడుతురు మీరు మాగురునింట భుజింతురు గాక తొందరయేల? అని వినయముతోఁ పలికినది.