పుట:కాశీమజిలీకథలు -07.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20]

గురుదత్తునికథ

153

ప్రతి గ్రామమునకుఁబోవుచు భాగ్యవంతులగువణిక్కులయిళ్ళకుంజని కన్యకల౦ బరీక్షించుచు రూపవతులై నను బుద్దిబలశూన్యులగువారిం బరిహరించుచు సంకల్పానుగుణ్యయగు కన్యకం బడయలేకపోయిరి.

ఒకనాఁడొక గ్రామమున నొకసత్రములో బసజేసి నానా దేశాగతులగు జనులతో ముచ్చటించుచుఁ గదాధరుం డందున్న కొందఱ బేహారులంగాంచి మీరెవ్వరు? ఎందుండి వచ్చుచుండిరి. యెందు బోయెదరు ? పనియేమి? అని అడిగిన వారిలో నొకఁడిట్లనియె.

అయ్యా ! మాది కుంభఘోణము. మేము వర్తకులము. మా యజమానుఁడు మిగులు భాగ్యవంతుఁడు. ఆతఁడు తన కుమారునికి మిక్కిలి చక్కనగు మగువం బెండ్లి జేయఁ దలంపుగలిగి దుర్గానగరంబునఁ గుముదాంగదుని కూఁతురు పద్మిని అను చిన్నది త్రిభువనాశ్చర్యకరములైన సౌందర్యచాతుర్యాది గుణవిశేషములచేఁ బ్రకాశించుచున్నదని లోకులవలనఁ దెలిసికొని యా కన్నె నడుగుటకై మమ్మందు లకుఁ బుత్తెంచెను.

మేమఱిగి యావైశ్యశిఖామణిచే నర్చితులమై యాయజమానుని విత్తాభిజాత్యాది భాగ్యవిషయములం బొగడుచు నతని సందేశమెఱింగించితిమి అతం డించుక విమర్శించుచు నాశెట్టిపట్టి విద్యారూపగుణంబులెట్టివని అడిగిన మేము అయ్యా ! అతండు గొడ్డువీఁగికనిన బిడ్డఁడగుటచే గారాబముగా బెంచి విద్యలు గఱపింప డయ్యెను. పురుషునికి రూపమేమిటికి ? “సర్వేగుణాః కాంచన మాశ్రయంతి” అనునట్లు వారి సిరియే యన్నిటికిం జాలియున్నది. నీపుత్రిక యింద్రభోగము లనుభవింపగలదు అని చెప్పిన విని అతండు నవ్వుచుఁ దనపుత్రికను రప్పించి అవ్విధంబెఱింగించిన నమ్మించుఁబోణి పెదవివిరచుచు మఱుమాట పలుకక అవ్వలికిం బోయినది.

అప్పుడతండు మాతో అయ్యా ! మాకు విద్యారూపశీలంబులు ప్రధానముగా నుండవలయును. సంపద నంతగాఁ బరిశీలింపము. . మాకీచిన్నది యొక్కరితయే దిక్కు. మాధనమంతయు నేమిజేయుదుము. మేమనుటఁగాదు మాపద్మినికి విద్యావ్యసనము మెండు. దానినిం దగిన పండితునికిం జేయకున్న నిందపాల్పడి పోమా ? అని యేమేమో చెప్పి మాకుఁ బయనమున కనుజ్ఞయిచ్చెను. మేమును ఫలవిముఖులమై పురాభిముఖులమై అరుగుచుంటి మని చెప్పిన విని గదాధరుఁడు సంతోషభరితహృదయుండై యిట్లనియె.

అయ్యా ! మీరాచిన్నదాని చూచితిరిగదా? సౌందర్యమెట్లున్నదని అడిగిన వారు అమ్మదవతి పదమూఁడేడుల ప్రాయములోనున్నది. అయ్యందము జూచితీర