పుట:కాశీమజిలీకథలు -07.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

150

కాశీమజిలీకథలు - సప్తమభాగము

దర్శించుచు సంప్రాప్తమనోరధుండై యింటికివచ్చి కిరాటవధూటి౦గాంచియాశీర్వచన పూర్వకముగా నిట్లనియె.

అమ్మా ! నీయుపదేశమునఁ బుడమి యంతయుం దిఱిగి తిరిగి బదరీవనంబున నొక యవధూత నాశ్రయించి మూడు సిద్దౌషదముల స౦పాదించుకొని వచ్చితిని. వినుము.

శ్లో. ఋతుడివసె ఘృతసహితం పీత్వానవనాగ కేసరస్యరజః
    దుగ్ధమనుసీయ రమణీ రమణిగతా గర్భిణీ భవతి

శ్లో. గోరేక వర్ణభాజః పయసా వంధ్యాపి ధారయే ద్గర్భం
    పీత్వా కేకిశిఖాయాః పుత్రం జీవస్యవా మూలం.

శ్లో. పీత్వామునైన పయసారజసి స్నా త్వాచ లక్షమూలం
    నస్తాంబుక్షాళితజలం భక్తం భుక్త్వానారీనుతం లభతె.

ఇవి కడు రహస్యములని యాయోగిజెప్పి యున్నవాఁడు మూడిటిలో నేత్రంతమునైనను వంధ్యయైన స్త్రీగర్భముధరించునఁట అయ్యోషధుల సంగ్రహించుకొని వచ్చితిని. తత్ప్రకారమునఁ గావింపుము. సిద్ధుల యుపదేశ మూరకపోదని యెరిగించి యాభూసురుండాశీర్వచన పూర్వకముగా అమ్మందులిచ్చి యట్లుకావింపఁ జేసెను.

తత్ప్రయోగమున వైశ్యాంగనయు విప్రపత్నియు అంతర్వత్నులై శుభలగ్నంబున నిరువురుపుత్ర రత్నములం గనిరి.

మనోహర రూపలక్షణ తేజోవిరాజితుండగు. కుమారునకు రత్నాకరుండు పండితుల యనుమతిని గురుదత్తుండని నామకరణము వ్రాసెను. బ్రాహ్మణపుత్రునకు గదాధరుఁడని పేరు పెట్టిరి ఆవర్తకుఁ డావిప్రుని బురోహితునిగా నియమించుకొని ద్రవ్య ప్రధానంబున దత్సమానులలో నుత్తమునిగాఁ జేసెను.

మఱియు గదాధరుని దనకుమారునితో సమముగాఁ బెంచుచు. యుక్తకాలంబున నిరువురం జదువవేసి సమర్దులగు నుపాధ్యాయుల నియమించి పెక్కు. విద్యల నేర్చించెను అక్కుమార శేఖరు లిరువురు నొజ్జలవలన అచిరకాలములోఁ బెక్కు విద్యలం గహించిరి.

విప్రపఠన యోగ్యములగు విద్యలతో మనకు బనియేమి? వ్యాపారరహస్యముల నేర్చికొమ్మని తండ్రి యెంత బోధించినను వినక తనివి ననక విద్యాగ్రహణాలసుండై గురుదత్తుండు పదియా రేఁడుల ప్రాయము వచ్చునప్పటికిఁ బండితప్రవరుండని వాడుక వడసెను.

గురుదత్తునికిఁ బదియేడుల యీడు వచ్చినది మొదలు పిల్లనిచ్చు తలంపుతో