పుట:కాశీమజిలీకథలు -07.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

146

కాశీమజిలీకథలు - సప్తమభాగము

నీకతంబున భార్యాపుత్రులు బ్రతికిరి - నీయట్టి హితుండు నాకుఁ గలడా ? నీయుపకార మెన్నటికిని మఱువఁ దగినదియా ? యావజ్జీము నీకుఁ గృతఁజ్ఞుఁడనై యుండెదను నీకు నేను జేసిన ఉపకారము మరువుమని ప్రార్థించెను.

అప్పుడు కౌరవ్యుఁడు వారినెల్ల బ్రార్దించి వాహనంబు లెక్కించి తన రాజధానికిఁ దీసికొని పోయెను. అందుఁ బద్మావతి యంతఃపురంబున దనుజపన్నగ కాంతలతోఁ గూడికొని వీరసింహ జయసింహుల దీసికొనిరమ్మని పరిచారకుల నంపినది. జయసింహుం డంతఃపురమున కఱుగుటకు సిగ్గుపడుచుండ వీరసింహుఁడు అన్నా? వెరచెదవేమిటి పోదమురమ్ము. ఆమె నిన్నుఁ బెంచినదికాదా! తేజోవతి నీకు సహాధ్యాయిని పదపద యని పలుకుచు నతని వెంటఁబెట్టికొని శుద్ధాంతమునకరిగెను. అయ్యంతఃపురము వింతగా నలంకరింపబడి యున్నది. తదీయ శోభావిశేషములు వీరసింహుని హృదయంబునకు విస్మయము గలుగఁజేసినవి.

నాగకాంతలు వారినిరువురఁ జెరియొక రత్నపీఠంబునం గూర్చుండంబెట్టి స్తుతిగీతంబులం బాడుచు మంగళహారతులిచ్చిరి.

అప్పుడు తేజోవతి పుష్పమాలికాహస్తయై అల్లనతగ్గి వెనుకనొదిగి నడుచుచు జయసింహుని దాపున నిలువంబడి అమ్మా ? యీతండేనా మన జయసింహుండు ! వీరి పరాక్రమమేగదా మనల నందఱ లంకాపురంబు బ్రవేశ పెట్టినది అందులకు వీరి కెద్దియేని గానుక లీయవలయుంగదా? ఇదిగోదీనితోఁ గూడ మదీయహృదయం బర్పించుచున్నదాననని పరిహాసమాడుచు నతని మెడలోఁ బుష్పమాలికవైచినది.

అతండు సిగ్గుపడుచు నౌను నేను జేసిన పని తప్పే మీయింటఁ గుడిచి మీకే యపకారముగావించితి నా యపరాధము సైరింపుమని పద్మావతి పాదంబులంబడి నమస్కరించెను. ఆమె గ్రుచ్చి యెత్తి బాబూ! తేజోవతి నిన్నుఁ బరిహాసమాడినది అందులకుఁ దగినమాటాడక వగచెదవేమిటికి? నీవు జేసిన పనికెల్లరు మెచ్చుకొనుచున్నారు. సంతోషముతోనే తేజోవతి యట్ల నుచున్నది లెమ్ము లెమ్ము. తేజోవతి మెడలో నీపూఁదామము వై పుము. అని మరియొక మాలిక యందిచ్చినది.

అతండందికొని తేజోవతీ! తప్పుఁజేసితిని క్షమింపుము యిదియే క్షమార్చణము అని పలుకుచు నాపుష్పదామంబా కామినీమణిమెడలోవై చెను. అప్పుడందున్న పన్నగకాంతలెల్ల వారిపైఁ బుష్పవర్షము గురిపించిరి.

పిమ్మటఁ జామరిక లేచి యువతులారా? యీ జయసింహుడు మనకు భయ ప్రదుడైనను దేజోవతి హృదయమిచ్చి యర్చించినది. అభయప్రదుఁడైన యీవీరసింహునెట్లు పూజింపవలయునో తెలియకున్నది. తండ్రితాతల కుపకారము గావిం