పుట:కాశీమజిలీకథలు -07.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహాయోగికథ

141

బెండ్లి యాడుటకు నిశ్చయించుకొన్నది. అందులకే యీ తగవు వచ్చినది. పారిజాతుని ప్రోత్సాహమున నే నిద్రించుచుండ నన్నుఁగట్టి తలాతలంబునఁ బడవై చిరి.

అదిఅంతయు నెఱింగియే మీతోఁ నాడినమాట దాటుట తప్పని యీయుద్ధము జేసితిని. ప్రతివీరుండు చదివిన పద్యమువిని నాకు సోదరుండట్ల తోచుచున్నది. భాతృవధయు, మిత్రవథయు నన్ను బాధింపకమానవు. విశ్వాసఘాతుపాతక మన్నింటికంటె బెద్దది మహా పుణ్యాత్ముఁడై న విభీషణుని మూర్ఛ నొందించిన నా దురితమునకుఁ బరిమితిగలదా? మహాత్మా ! నేనన్ని గతులఁబతితుండనై తిని. బంధువులకు వెలియైతిని తేజోవతి నేమొగముతోఁ జూడగందును. ఇఁక నాకు సంగరముతో బనిలేదు. మీ పదములమ్రోలఁ బ్రాయోపవిష్ణుండనై ప్రాణములు వదలెద ననుజ్ఞ యిండు” అని అడుగుల౦బడి వేడుకొనుచున్నాఁడు. ఇంతవట్టు చూచివచ్చితిని. వాఁడే జయసింహుఁడు ఇఁక పోరుసల్పఁడు వెరవకుఁడు అని యెఱింగించె.

ఆకథవిని విభీషణుండు ఏమీ? వాఁడు జయసింహుఁడా ఔరా ! వాడెంత బలవంతుఁడు ఎట్టి సత్యసంథుఁడు ఇప్పటికి నా ప్రాణములు గూటఁబడినవి. దేవాసురుల యుద్ధములనేకములు జూచితినికాని వీనివంటి వీరుం జూచియెఱుంగను. ఈ శుభవార్త నంతఃపురకాంతల కెరంగించిరండు. మనమందఱము పోయి యాయోగిం బ్రార్థింతము మన వీరునిఁగూడ బ్రతికింపఁగలడు అని పలికి ప్రహస్తాదిమంత్రులతోఁ గూడికొని యా యుద్యానవనమునకఱిగెను.

అందయ్యోగీంద్రుండు జయసింహునిఁ దొడలపై నిడుకొనియెద్డియో ముచ్చటింపుచుండెను.

తన దర్శనార్థమైన విభీషణుఁడు వచ్చినాడని విని యాయోగి యట్టెలేచియెదురు వోయి నమస్కరించుచు నిట్లు స్తుతియించెను.

సీ. ధరణిశ్రీరామావతార తారకమూర్తి
           గన్నులారఁగన్న పావనుడఁవీవు
    ఖలులైన పొలనుఁ డిండుల నెల్ల వరతపో
          ధనులఁ గావించిన ఘనుఁడ వీవు
    హరిపాద కమల సేవా యత్తపృధు చిత్త
          పరమభాగవత శేఖరుఁడ వీవు
    బలిమృకండు తనూజపవనాత్మజుల మించి
          చెలువొందు చిరకాల జీవివీవు