పుట:కాశీమజిలీకథలు -07.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18]

భుజగాసురుల యుద్ధము

137

సంక్షేపముగాఁ చెప్పుటయుఁ జంపక సంతసించుచు వానికిఁ బారితోషిక మొసంగి యిట్లనియె. వీరసింహునకు ప్రతివీరునకుఁ బోరు జరిగినదా! కోట మన కెట్లు స్వాధీనమైనది? ఆవృత్తాంత మెఱింగింపుమని అడిగిన వాఁడిట్లనియె.

ఆమహావీరుని ప్రతాపము నాబోటులువర్ణింపఁజాలరు. వినుండు. మనవీరుండు విజృంభించి శత్రుసేనల నసమానపరాక్రమంబునఁ బీనుఁగు పెంటలగావించినఁ బ్రతివీరుండు యుద్ధమునకుఁ బూనుకొనిన యేదియో విచారంబునఁ గుందుచుండెనఁట. మనవీరునకుజడిసి రణవిముఖుండయ్యెనని కొందరు దలంచిరి. అప్పుడు వజ్రకంఠుఁడు విభీషణ జయంబునకుఁ బరితపించుచు నావీరుంబోర యనేకవిధంబులఁ బ్రతిమాలు కొనియెను.

అతండు దుఃఖాక్రాంతస్వాంతుడై వాని పరిదేవనంబు వినిపించుకొనఁడయ్యెను. వజ్రకంఠుండు అడలుచు వేగము తలాతలంబున కరిగి అందున్న యోగి పాదంబులంబడి మహాత్మా! మీయక్కటికంబున మనవీరునివలన విజయము గ్రైకొంటిమి. మీశిష్యుండు విభీషణాది దానవులఁ బీచమడఁచెను. అంతలో శత్రుసేనలోనుండి యొకవీరుండు తురగారూఢుండై యరుదెంచి మాబలంబులనెల్లఁ బటాపంచలు గావించెను. వాని నెదుర్కొను డని మే మెంత బ్రతిమాలినను మన హరిదాసు ఆయుధము బూనఁడయ్యెను మాకు వేరొకగతిలేదు. మీరువచ్చి వారికి రణోత్సాహము గలిగింప కున్నఁ బ్రతివీరునిచే మే మందరము మడియఁగలము. వేగవచ్చి రక్షింపుమని వేడుకొనియెను. అతిదయాళుండైన యా యోగి వానిదుఃఖమునకు వగచుచు వానితోఁ గూడఁ బాతాళమున కరుదెంచి హరిదాసుంగాంచి దీవించుచు వత్సా! శత్రువులు విజృంభించుచుండఁ బ్రతివీరుల నాపఁనోపియు నుపేక్షించుచుంటివఁట. ఏమిటికి? అట్లుచేసిన శరణాగతరక్షణమునకు లోపముగాదా?

సత్వరముగ లేచి యాయుధముబూని స్వపక్ష రక్షకముగ బ్రతిపక్షుల శిక్షింపుము. అని యుపదేశించిన విని యావీరుండు అతనికి నమస్కరించుచు యోగీంద్రా! వేరొక కారణంబునఁజేసి సమరవిముఖుండనైతిని. పగరకు వెరచిగాదు. కానిండు ఇప్పుడు తృటిలో శృతువులఁ బరాభవించెదఁ జూఁడుడు. అని పలుకుచు అపుడు తత్తడ నధిష్టించి యాయుధంబులం బూని దానవపన్నగంబులఁ బురిగొల్పుకొని రణరంగంబున కరిగెను. వెండియు రెండుబలంబులకుఁ పోరు ఘోరంబుగా జరిగినది.

అందు మనవీరుండు ప్రతివీరుని దలపడి సింహనాదము జేయుచు విచిత్రగతులఁ దురగమును నడిపించుచు అద్భుత సంగ్రామము గావించెను. ఆవీరకుమారు