పుట:కాశీమజిలీకథలు -07.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

134

కాశీమజిలీకథలు - సప్తమభాగము

దీర్ఘ జంఘుఁడు ముందరకువచ్చి భర్తృదారిక! నమస్కారము నేను సందేశహరుండ దేవరదాసుఁడ, పాతాళమునుండి యిప్పుడే వచ్చితిని. ప్రహస్త పుత్రుండు మీకీ పత్రిక నిమ్మని పంపెను. గైకొనుఁడు అని పలుకుచు నాకమ్మ చేతికందిచ్చెను.

చంపక దానింబుచ్చుకొని తొందరగాఁ జింపి యిట్లు చదివెను. యుద్ధక్రమ మంతయు దీర్ఘ జంఘుఁ డెఱింగింపఁ గలడు. ప్రస్తుతము మన కపజయము గలిగినది. వజ్రకంఠుడు పారిజాతుని బ్రోత్సాహమున లంకాపురి కరుదెంచి తేజోవతిని జెరఁబట్ట యత్నించుచున్నట్లు తెలసినది. అంతఃపురకాంతలెల్ల నేకాంత నిశాంతముల కరుగుటకు నాయత్త చిత్తులై యుండవలయును. మా రెండవవార్త వచ్చుదనుక నిల్లు కదలవద్దు. ఇట్లు పాద సేవకుఁడు మంత్రిపుత్రుఁడు. ఆజాబు చదివికొని యిచ్చగింపక కంపకలితదేహయై దీర్ఘ జంఘా! మాతాతయుదండ్రియు దగ్గరచుట్టము లుండఁ బ్రహ్మస్త పుత్రుఁడీ పత్రిక పంపుటకు గారణమేమి? యుద్దవిశేషము లేమియో చెప్పుము. నా మనసు తొట్రుపడుచున్నదని అడిగిన వాఁడిట్టని చెప్పఁదొడంగెను.

దేవీ ! వినుము విభీషణమహారాజు చతురంగ బలంబులతోఁ దండువెడలి పాతాళలోకంబునకుంజని దారిలో బలిచక్రవర్తి దర్శించి క్రమంబున భోగవతీ నగర ప్రాంతమున విడిచి వ్యూహములుబన్ని రణభేరీ మ్రోగింపఁజేసిరి. ఆధ్వని విని శత్రువులు మరల రణభేరీ మ్రోగించిరి. క్రమంబున రెండు సేనలు కలియబఁడి సంకుల యుద్ధము గావించినవి. మీతండ్రి సర్వ సేనాధిపత్యము వహించి సేనలు నడుపుచుండ విభీషణమహారాజు గదాపాణియై యుద్ధము జేయుచుండఁ బాములును దనుజులును నిలువఁగలరా ? విభీషణుండు ముహూర్త మాత్రములోఁ బగతురనెల్ల హాహాకార రవంబులతోఁ బలాయితులం గావించెను.

మనబలంబులు గౌరవ్యుని కోట నాక్రమించుకొనఁబోవు సమయంబున నొక వీరపురుషుండు తురంగారూడుండై అరుదెంచి ఆబలంబులఁ బురికొలుపుచుఁ బ్రచండ భందనము గావించెను. ఇకజెప్పనేల నావీరుని సంగరప్రకారమిట్టిదని వర్ణింపఁ బరమేశ్వరునికి వశముకాదు. అందరు కన్నిరూపులై యెక్కడ జూచినఁ దానియై దానవ వీరులనెల్ల అవలీల లేళ్ళగమి శార్దూలంబువోలెఁ బారదోలెను. రాక్షస వీరులు ప్రయోగించు శస్త్రాస్త్రసాధనంబు లతని నించుకయుఁ బాధింప కృతఘ్నునికింజేయు నుపకృతివలె వ్యర్థ౦బులైపోయినవి.

మొదటఁ బ్రహస్తునికి అతనికి ద్వందయుద్ధము జరిగినది. ముహూర్తకాలమైన