పుట:కాశీమజిలీకథలు -07.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కలభాషిణి కథ

131

వీరసింహుడు దళములవెనుక నడుచుచున్న కతంబున నందఱు దుమికిన పిమ్మట నారాతిపలక చేరెను. క్రిందికిఁ జాడ నేమియుఁ గనంబడదు. అందుఁ గూర్చుండి అయ్యో? రక్కసులందఱు దుమికి క్రిందికిఁ బోయిరి. ఆధారమేదియును లేదు నేనెట్లుదిగువాఁడ? నేను వట్టి మూఢుఁడ. విభీషణుని యెదురఁ బడి నా వృత్తాంతము జెప్పి యద్ధమునకుఁ దోడువత్తుననిన శిరముపైఁ గూర్చుండఁ బెట్టుకొని తీసి కొనక పోవునా? నా బుద్ది సురిగినది ఇఁక నేనేమి జేయుదును. వీండ్రవలె దుమికితినేని క్రిందఁబడి ప్రాణములు విడుతును అందులకు నా పరాక్రమమేమిటికిఁ బనికి వచ్చెఁడిని అని తలంచుచు నారాతిపై నిలిచి మరల దుముకుటకు సాహసించి కాళులు క్రిందికిఁ జాపుచు మఱల నురక వెరచుచు నీరీతి డోలాయితహృదయుండై యున్న సమయంబున వెనుక యెవ్వరో వచ్చుచున్న ట్లలుకుఁ డై నది.

ధైర్యముతో నెవరువారని కేకవైచెను. నేను విరూపాక్షుఁ డనని యతఁడు ప్రత్యుత్తరమిచ్చెను. ఓహో వచ్చితివా? ఇంత యాలస్యము చేసితివేల? నీ నిమిత్త మే మహారాజు నన్నిందు నిలువఁ బెట్టెను పోదము రమ్మని పలికిన జడియుచు నా బడుగు అయ్యా కొంచెము పనియుండి యాలసించితిని. మహారాజునకే తెలిసినదా అయ్యో యేమి చేయునో కదా యని వెరచుచుండ రమ్ము రమ్ము ఏమియు, జేయఁడు అని పిలిచి వాని మెడ బిగ్గరగఁ బట్టుకొని వానితోఁ గూడఁ బాతాళలోకమున కురికి రాక్షసబలంబులం గలసికొనియెను.

అందు విభీషణునిజూడ నరయుచుండ నతండు బలిదర్శనమునకుఁ బోయినట్లు ఎవ్వరో చెప్పుకొనుచుండఁ దెలిసికొని తానుగూడఁ బోవఁదలంచి యా ప్రదేశమంతయు దిరుగ నొకచోట బలి భవనద్వారమని వ్రాయబఁడియున్న ప్రకటనఁజదివికొని అల్లన నాద్వారముగుండ లోనఁ బ్రవేశించెను.

ఊర్ధ్వపుండముల ధరించిన వైష్ణవభటులు పెక్కండ్రా గుమ్మమును గాచు చుండిరి. వారిం దప్పించుకొని లోనికిఁబోవఁ బ్రయత్నించుచుండ నొకవైష్ణవుఁడు నా చేయి బట్టికొని నీవెవ్వఁడవు? ఇట్ల దృశ్యుఁడవై పోవుచుంటివేమి? చెప్పుమని అడిగిన భయపడుచు స్వామీ ! నేను వీభీషణ పరిచారకుండ. బలిచక్రవర్తిం జూడబోవుచున్నాఁడ నన్ననుగ్రహింపుఁడని వేడికొనిన నతండు నవ్వుచు పోపొమ్మని చేయి విడిచెను. ఒకటవవాకిలి రెండవవాకిలి అని ప్రతిద్వారమునకును సంఖ్య వేయబడి యున్నది అట్టివాకిళులు నాలుగుదాటి వీరసింహుడుఁ విస్మయావేశహృదయుండై దిగ్భ్రమజెంది వచ్చినదారియుం బోవలసిన దారియుం దెలియక తిరుగుచుండెను. అందుఁగల విశేషముల వర్ణింప ననంతునికైనను బెద్దకాలము పట్టును. అది యింద్ర