పుట:కాశీమజిలీకథలు -07.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

128

కాశీమజిలీకథలు - సప్తమభాగము

బడుటలేదు. ఎక్కడికో విహరింపనేగె ననుకొంటిని. ఆపాపాత్ముడు వానింజంపిన మాట వాస్తవమే. అసత్యము గాదు. వాఁడే జీవించియుండిన మాకీ యిక్కట్టు రాకపోవును. కోటదావునకు శత్రువుల రానిచ్చునాయని పెద్దయెలుంగున నేడువఁ దొడంగెను.

బద్మావతియుఁ గన్నీరునించుచుండెను. చామరికయు రేవతియు దేజోవతిం బట్టుకొని యూరడింపుచుండిరి. ఇంతలో లోవలినుండి జయసింహునితల్లి కళావతి యక్కడికివచ్చి యడలుచు హా? పుత్రరత్నమా హా? విక్రమాదిత్యకులరత్నాకర నిశాకరా! విజయభాస్కరతనూభవా! అస్తమించితివి? యని తన వృత్తాంత మంతయుఁ తలంచుకొని చింతింపదొడగెను.

అప్పుడు వీరసింహుడా యల్లరియంతయుంజూచి గుండెపగుల నౌరా ! తేజోవతి సంతోషమునకు విధి యంతరాయము గలుగఁజేసెనే ? జయసింహునితల్లి దుఃఖముజూడలేకుంటిగదా ? మఱియు విక్రమాదిత్యకులదీపిక విజయభాస్కరతనూభవ యని వగచుచున్నది. నా మనంబునంగల అనుమానము దీరినది. యీమె కళాభాషిణియే జయసింహుఁడు నాసహోదరుడగుట సత్యము. వాని మరణవార్త నిన్న వేగులవారు తీసికొనివచ్చియందురు. చంపకాసక్తుండనై నిన్న నేను రాక్షస సభకు బోలేదు. మంచివార్తయే వినంబడినది. నన్ను విధి పైకెత్తి నేలఁబడఁద్రొబ్బెనే అయ్యో? నాసోదరునిఁ జూచుభాగ్యము పట్టినది కాదుగదా ? శుభపరంపరలభించున్నదని యానందించుచుంటిని. ఇప్పుడు నాతల్లి నేమని యోదార్చుదును. నేను శత్రువులఁ బరిభవించి విజయము గైకొనిన లాభమేమి? ఇందుల కానందించువారెవ్వరు ? అక్కటా ? మా విధీ ? నాసంతోషమంతయు నెంతలో నంతమునొందించితివి ఇఁక నాకుఁ జంపకతోఁ బనియేమి ? మాతల్లినోదార్చి యింటికిం దీసికొనిపోవుట కర్జము. ఈ రాక్షసస్త్రీ మధ్యంబునఁ గురరియుంబోలె నూరక శోకించుచున్నది. అని తలంచుచు వీరసింహుఁడు నిలువలేక నాహార మొకచోట దాచి హాతల్లీ ? వగవకుము నీపుత్రుండ నేనిదిగో వచ్చితినని పలుకుచుఁ గలభాషిణిదాపునకుఁ బోయెను.

అతనింజూచియెల్లరు తెల్లపోయిచూచుచుండిరి. జయసింహుడు,జయసింహుఁడు అనికొందఱు కేకలు పెట్టిరి. తేజోవతిజూచియు నిన్నటివాడే అని యుపేక్షజేసి లోపలికిఁ బోయినది చంపకయు సఖులతో నొక గదిలోనికింబోయి గవాక్షమునుండి చూచుచుండెను. ఇతరకాంతలెల్ల దూరముగాఁ బోయిరి. కలభాషిణియుఁ బద్మావతియుఁ గాక మరి యెవ్వరును లేరు.

కలభాషిణి వీరసి౦హునింజూచి అదరిపడి నాయనా ? నీవు మాజయసింహు