పుట:కాశీమజిలీకథలు -07.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

126

కాశీమజిలీకథలు - సప్తమభాగము

హరిదాసు వజ్రకంఠునందు నిష్టములేనివాఁడైనను గురునాజ్ఞఁ జేసి అంగీకరించి నీశత్రులెందున్నారు చెప్పుమని యడిగిన నారక్కసుండు వీరోత్తమా! పాతాళమున నా మిత్రులకును శత్రువులకుఁ బెద్దయుద్ధము జరుగఁబోవుచున్నది. మేము మిత్రులకుఁ సహాయము పోవుచున్నారము. మీ సహాయంబునఁ దప్పక విజయము మాకుఁ గలుగఁ గలదని చెప్పెను.

పాతాళంబున మీకు మిత్రులెవ్వరు శత్రులెవ్వరని అడిగిన హరిదాసునకు వాపొలనుడిండు ఆర్యా ! వినుండు కాకోదర చక్రవర్తులైన తక్షకకర్కోటక కులస్థులగు నురగపతులు మాకు మిత్రులు తత్కులకాతుండగు నేలాపుత్రుండు వాసుకి కులజుండగు కౌరవ్యునిపై, గత్తిగట్టి వారినగర‌ మిప్పుడు ముట్టడింపఁ బ్రయత్నించుచునాఁడు. లంకాధిపతియగు విభీషణుఁడు వారికిఁ జుట్టమగుట సహాయము రాకమానఁడు. నీసహాయము లేకున్న మేమును నురగులును వారిని జయింపజాలము. అందులకే మిమ్ముఁ గోరుకొంటిమి. మీరే సర్వ సేనాధిపతులై యద్దము నడిపింపవలయునని చెప్పెను.

అప్పుడా హరిదాసు కన్నులు మూసికొని యించుక ధ్యానించి యెద్దియో విచారము హృదయంబునం దోప అల్లన కన్నులు విప్పి చూచుచుఁ గౌరవ్యునకుఁ నేలాపుత్రునకుఁ విరోధమేటికిఁ గలిగినదని యడిగిన వాడట్లనియె.

ఆర్యా ! అంతయు జెప్పవలయునా? వినుండు. ఇప్పుడు కాకున్నఁ బిమ్మట యైనం దెలియకమానదు కౌరవ్యునికూతురు తేజోవతి మిక్కిలి చక్కనిదఁట దాని నెక్కడనో చూచి యెలాపుత్రుని కొడుకు పారిజాతుఁడు బాల్యచాపల్యంబునఁదన్నుఁ బెండ్లియాడుమని యొక దాదిచే వర్తమానము బంపినఁ దానంతకు మున్నెవ్వరినో వరించి యున్నాననిచెప్పుము బారిజాతుని దాసీపుత్రికచే దుర్భాషలాడించినదఁట ఆకారణమున వారికిని వీరికిని గ్రమంబున వైరంబు బెరిగినది. ఇప్పుడిరువురు యుద్ధసన్నద్దులైయున్నారు. విభీషణుఁడు సంధికి నేలాపుత్రునకు రాయభారము పంపియున్నాడు. మనవారు జడియుచున్నారు ఇప్పుడు మనము పోయి వారి కుత్సాహము గలిగింపవలయునని యా వృత్తాంతమంతయుం జెప్పుటయు నతఁడొక్కింతతడవు నిశ్చేష్టితుండై కొంతవడికిఁ దెలిసి పదుఁడు పదుఁడు లెండు లెండని పలుకుచు నప్పుడే రాక్షసబలంబులతోఁగూడఁ బాతాళమునకు వచ్చెనఁట ఇవియే నేను దెలిసికొని వచ్చిన విశేషములుఁ ఆవీరుఁడే మనవారినెల్ల గాందిశీకులఁ గావించెను. ఆయోగి చాల మంచివాఁడు మీరు వోయి యాయనను నాశ్రయించితిరేని హరిదాసు యుద్ధ--------- గావించును. అప్పుడు మనము సులభముగా శత్రువుల జయింతుమని యావేగులవాఁడు చెప్పెను.

పిమ్మట మరియొక వేగులవాఁడు ఎదుటకువచ్చి మహారాజా ! తమయానతి నేను