పుట:కాశీమజిలీకథలు -07.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తేజోవతి కథ

117

నీ శుభలేఖను జూచి మిగుల నానందించితిమి. నీతో సంబంధము చేయుటకు నాకర్హత గలదని నీకుఁ దోచినందులకు సంతోషమే కాని అందలి యదార్థము పండితులవలన దెలిసికొనవలసియున్నది. వారితో నాలోచించి ముందు దగినట్లు ప్రత్యుత్తరము వ్రాసెద నంతదనుక నిదియే సమాధానము. అని వ్రాసియంపిరి. దానికి వికటముగా నేలాపుత్రుఁడు ప్రత్యుత్తరము వ్రాసి యంపెను. అంతకన్న వికటముగా వ్రాసి మరల వీరు పంపిరి. ఈ రీతి నుత్తర ప్రత్యుత్తరములతో నారు మాసములు గతించినవి.

గూఢచారు లొకనాఁడు వచ్చి యేలా పుత్రుని సభలో జరిగిన చర్చయంతయు మాకుఁ దెలియఁజేసిరి. నేనాకథ విని రేవతింజీరి ఓసి? పారిజాతుం డెప్పుడో తేజోవతినిఁ దన్ను బెండ్లి యాడుమని అడిగిన నతని నెక్కుడుగా నవమానపరచితిరఁట. ఏమిటికని‌ యడిగిన నది యిట్లనియె.

దేవీ ? వినుము మే మొకనాఁ డుద్యానవనములోఁ గ్రీడించు చుండఁగా హంసికయనునది వచ్చి పారిజాతుని సౌందర్యాదులు పొగడుచు నతనిం బెండ్లి యాడుమని భర్తృదారికతోఁ జెప్పినది. ఆమాట లాబోటికిష్టములేక నాకుఁ గన్నుసన్న జేసినది. మీరాజపుత్రుఁ డట్టి వాఁడే కావచ్చును. మారాజపుత్రిక వేరొక సుందరుని వరించియున్నది. ఈమెపైగల అతని విరహము మరలించుకొనుమని చెప్పితిని. ఇంతకన్న మఱేమియు ననలేదు. ఈమాటయుఁ తేజోవతి యానతివడువున నుడివితినని జెప్పిన నే నివ్వెరపడి యిట్లం టి.

అమ్మాయి యెవ్వరిని వరించియున్నది. మేమెఱుగమే? నిజము చెప్పమనుటయు నది భయపడుచుఁ గొంత సిపేమియుఁ జెప్పినదికాదు. నేనెక్కు డుగా నిర్భంధించుటచే నాపతి తల్లీ ? మనయింటఁ బెరుగుచున్న జయసింహూనిఁ ద్రికరణములచేత వరించియున్నది మఱియొకనిఁ బెండ్లియాడదు. మీకడ సిగ్గుచేఁ జెప్పుటలేదు. మాతో నట్లే నిశ్చయించినది. అని యామె అభిప్రాయము యెఱింగించినది. మాకును లోలోపల నట్టి అభిప్రాయమే కలిగియున్నది. కాని వెల్లడించలేదు. అమాటలు విని నేను సంతసి౦చుచు నా భర్త కెఱింగించితిని.

ఆయనఁ జిఱునగవుతో నాతీ ! తేజోవతి యభిలాషయుక్తముగానున్నది. నీ కిష్టమైనట్లు కావింపవచ్చును అతడు రూపవంతుఁడు విద్యావంతుఁడు పరాక్రమవంతుఁడును. కాని వాని కులశీలము లెట్టివో తెలియవు. ఈసారి గట్టిగా నిర్భంధించి తల్లి నడిగి తెలుసుకొనుము వాఁడెక్కడ నున్నాడు? ఈ నడుమ కనంబడుటలేదు. అని పలికిన నేను నాధా ! అమ్మాయికి నీడువచ్చినది మొదలు వాని వేరొక పాఠశాలఁ