పుట:కాశీమజిలీకథలు -07.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తేజోవతి కథ

115

కాసపడవలదని చెప్పుము. అని తేజోవతి తన పరిదారికచే నోటికిరాని దుర్భాషలు పలికించినదఁట. వాని కెద్దియో హంసిక సమాధానము జెప్పబోవుచుండఁ బరిచారికలచేఁ గొట్టింపఁ బ్రయత్నించిన నది పారిపోయి వచ్చినఁదట హంసిక నడుగుఁడు అని వెక్కి వెక్కి యేడువఁదొడంగెను.

అప్పుడేలాపుత్రుఁడు రోషానలంబు గన్నులఁగ్రక్కు చు హంసికను రప్పించి ఏమే రండా? పెద్దవారికిఁ జెప్పకుండ నీ వక్కడికిఁబోయి పిల్లనేమిటి కడిగితివి. కానిమ్ము. ఆనీచురాలేమన్నదో చెప్పుమనుటయు అది స్వామీ ! పోవుట నాది తప్పే? అబ్బాయిగారేమియు నెరుగనే యెరుఁగరు. జోడు సరిపడును గదాయని తలంచితిని. ఇంత గర్వమని యేరికి తెలియును ? పోనీ? ఆ అమ్మాయిగారన్నను బాగుండును. గవ్వజేయని దాసీపుత్రికచే నిందించినందులకు జింతగానున్నది. వారిపరువునకు మనము సరిపడమఁట అబ్బాయిగారు విద్యలేనివారఁట తండ్రీ ! ఆమాటలన్నియు మీకడఁ జెప్పజాలను. అని లేనిపోని మాట లెన్నేని జెప్పి అతని కోపాగ్ని ప్రజ్వరిల్లఁ జేసినది.

అప్పు డయ్యురగపతి మంత్రుల రప్పించి అయ్యుదంత మెఱింగించి కౌరవ్యుని వంచించు నుపాయ మెరింగింపుడని అడిగిన వానికి వేణీస్కందుఁ డను మంత్రి యిట్లనియె.

దేవా ! చిన్నతనముచేత నాతనిఁ కూతురేమో యాక్షేపించినదని మనము పెద్ద సన్నాహము చేయఁదగదు. కౌరవ్యుఁ డుత్తమగుణ సంపన్నుఁడు. మనల నిందించువాఁడు కాఁడు. వీరి మాటలలో నెంత నిజమున్నదియో యరయవలయును. తొందరపడరాదు. అదియునుంగాక కౌరవ్యుఁడు లంకాధిపతియగు విభీషణునికిఁ బ్రాణ బంధువుఁడు వాని మనము వంచింపఁబూనితిమయేని విభీషణుఁడు సహాయము రాక‌ మానఁడు. మూడులోకము లొక్కటియైనను నా రాక్షసవీరులతో బోరవశమా? కావున సామముననే యీ మాటల నాయనకుఁ దెలియజేసి యాక్షేపింపవచ్చునని పలుకగా వారించుచు శిశ్రుమారుండను మఱియొక మంత్రి యిట్లనియె.

చాలుఁ జాలు. నీమాటలు మెచ్చదగినవే. రాజపుత్రుడు స్వయముగాఁ జెప్పుచుండ నసత్యముండునా ? కౌరవ్యునికి విభీషణ నహాయమున్నదని మనము వెరవఁ బనిలేదు. అదియే మన కుపకారమైనది. విభీషణుఁడు రాక్షసజాతికెల్ల శత్రువు. రక్కసిపురుగున కతనిపేరు జెప్పిన రోనమెక్కకమానదు. మాంశాశనులగు వారినెల్ల శాకాశనులగన్ముని నిర్భంధశాసనము జేసియున్నాఁడు. అందఱును రామ భక్తుల గమ్మని యాజ్ఞాపించుచున్నాఁడు. దానంజేసి యాపాతాళంబున గల దానవు