పుట:కాశీమజిలీకథలు -07.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విభీషణుని కథ

107

యేలా పుత్రుఁడు దుర్వారబల సహాయబల గర్వితుండై పోరుచున్న వాఁడు మనము తగు ప్రయత్నము చేయవలయును లంకలోఁగల మూలబలంబులునెల్ల నాయితము గావింపుము ఇప్పుడు యుద్ధమెట్లున్నదో వార్తాహరులనంపి తెలిసికొనుమని పలుకచుండఁగనే రాక్షసవీరుల హాహా కారధ్వనులు వినంబడినవి.

అందఱు నాదెస చెవియొగ్గి వినిరి. ఘోరముగా నాధ్వని వినంబడుచుండెను. కొందఱాదెసకుఁ పరుగిడిపోయిరి అంతలోఁ బాతాళములుండి పరాజితులై రక్కసులు పారిపోయి వచ్చుచున్నారను వార్తయొకటి వ్యాపించినది. ఆమాట విని విభీషణుం డదరిపడి ప్రహస్తుం జూచి నేననలేదా?. మన కపజయము గలుగునని సూచనలు దోఁచినవి. నిజమేమియో తెలిసికొనుము తరువాత సన్నాహము గావింతమని పలికెను.

అట్లువారు సంభాషించుకొనుచుండగనే పాతాళమునుండి వచ్చిన రాక్షసబలములా ప్రదేశము నిండించినవి అప్పుడు సేనాధిపతియగు దుర్దముండు దీనవదనుండై రాజునొద్దకు వచ్చి నమస్కరించి నిలువంబడుటయుఁ బ్రహస్తుండు వాని నమస్కారము లందుకొని యిట్లనియె దుర్దమా ! యరిమర్దన సమర్థములగు మనబలంబు లిట్లు యుద్దవిముఖంబులై వచ్చుటకుఁ గారణంబేమి? అందు శౌర్యధుర్యులగు మహావీరు లెవ్వరు గలరు? సంగరంబెట్లు జరిగినది? మీరేమి చేసితిరి? సవిస్తరంబుగఁ దెలుపుఁడని యడిగిన నావాహినీపతి యిట్లనియె.

దేవా! దేవరవారి యానతీ వడువునఁ జతురంగబలంబులంగూడికొని నేనును గుప్తబిలమార్గంబున రసాతలంబున కరిగి కౌరవ్యునింగాంచి తమ సందేశం బెఱింగించితిని. అయ్యురగాధిపతి మమ్ముఁజూచి అపరిమితానందంబుఁ జెందుచు దమ బలంబులతోఁ గలిసివ్యూహంబులుగా నిలువ నాజ్ఞాపించెను. అప్పటికి భోగవతీనగరంబునకు దక్షిణముగా రెండుక్రోశముల దూరములో శత్రుబలములు వ్యూహముగా నిలువంబడి యున్నట్లు తెలియవచ్చినది.

తలాతల రసాతలంబులంగల రాక్షసబలంబులు తక్షక కర్కోటక బలంబులుం గలసి రోదసీకుహరంబునిండ గర్జిల్లుచుఁ బెల్లుకొని వచ్చు కల్లోలమాలింబోలె నాబీల రౌద్రవేశంబున అరుదెంచి యొక్క పెట్టున నప్పట్టణంబు ముట్టడింప దలపెట్టి యట్టి సన్నాహము గావింపు చుండిరఁట.

మేమును సర్పబలంబులును, దర్పంబున వ్యూహంబులుగా బురి చుట్టునుం గాచికొని శస్త్రాస్త్రప్రయోగంబులం గావించుచుంటిమి. మా రాకవిని మూడుదినంబుల దాక నెదరి మూకలు వ్యూహంబునందలి కదలి మీఁదికి రాలేకపోయినవి. అప్పుడు