పుట:కాశీమజిలీకథలు -07.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106

కాశీమజిలీకథలు - సప్తమభాగము

మ. విను లంకాపురివారుగారు మఱి బోర్వీర్యంబునం బేరుపొం
     దిన నానాభువనంబులం గల సురద్వేషుల్‌ మహేంద్రాదులే
     పున నేకంబుగఁ గూడివచ్చి బవరంబుంజేసినం బోక నొ
     క్కనిమేషంబున మిమ్ముఁ గెల్చిజయముంగై కొందుమోదానవా?

క. నీవొక వివేకవంతుఁడ
   వే? వీరుఁడవే? తృణప్రవృత కూపగతిన్
   బై వెలయింతువు నీతుల
   కోవిదుఁడవుగావు చెప్పకుము ధర్మంబుల్‌.

సీ. శేషుఁడెంతటివాఁడు చెప్పంగనగునె వా
             సుకి ప్రభావంబు తక్షకునిమహిమ
    కొనియాడవశమె కర్కోటకు సామర్థ్య
             మలఁతియే ధృతరాష్ట్రు నతియంబు
    ప్రణుతింపఁదరమె కౌరవ్యు నాధిక్యము
             సన్నుతింపఁగ బ్రహ్మశక్యమగునె
    తరమె యెలాపుత్రు గరిమవర్ణింపంగ
            నైరావతుఁడు నుతి కంతువాఁడె

గీ. జగము లన్నింటి బ్రోవంగ జాలువారు
    మాదు పెద్దలు బుద్దులు మాకు మేము
    చెప్పుకొననవలెగాక శాసించి యిట్టు
    లవుర। తెలుపంగ నీ వెవ్వఁడవుర‌ మూఢ.

అని మనకు మరల రాయబారముఁ బంపెనని చెప్పిన విని విభీషణుఁడు భీషణభ్రుకుటీముఖుండై యేమేమీ? ఏలాపుత్రునికే యింతక్రొవ్వు. మనకు దాసుఁడై క్రుమ్మరు నా నీచున కింత ప్రౌఢిమ యెట్లు వచ్చినది. యెవని యూతఁజూచి యిట్లు ప్రల్లదము లాడెను. కానిమ్ము పిమ్మట నేమిగావించితిరని అడిగినఁ బ్రహస్తుండు దేవా! మన లంకంగఁల వీరభటులనెల్లఁ గౌరవ్యునికి సహాయముగాఁ బంపితిమి. పోరు ఘోరంబుగ జరుగుచున్నఁదట మఱియు మనవారి బలమలఁతియగుచున్నదని ఈనడుమ గాలివార్త దెలిసిన శాఁబరీ గ్రంధాలయము దెరపించి మాయావిద్యాల నేర్పించి పెక్కండ్ర రక్కసుల మొన్ననే యుద్ధమునఁ బంపితిమని యావృత్తాంత మంతయుం జెప్పెను. ఆకథ యంతయును విని విభీషణుం డొక్కింతసేపు శ్రీరామ నామమంత్ర పారాయణపరాయణత్వమున వివశుండై అంతలోఁ దెలిసి ప్రహస్తా!