పుట:కాశీమజిలీకథలు -07.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

కాశీమజిలీకథలు - సప్తమభాగము

సీ. పలపలగా బట్టతలపైనఁ బండిన
           కుంతలంబులఁజేర్చి కొప్పువెట్టి
    రదములెల్ల నురాలఁ బెదవులతో బొక్కి
           నోరప్పలింపుచు సారెసారె
    చర్మావశిష్ట కుచద్వయం బురమున
           చర్మ భస్తికలట్లు జారివ్రేలఁ
    గరచరణాద్యంగకములెల్ల జీర్ణించి
           కాష్టముల్ పగిది వికారమొంద

గీ. పండివాడిన పణిలతావర్ణమట్లు
   దేహలత యెండి ముడుతలుదేరి యుండఁ
   దలఁదల్చుచుఁ జేత వేత్రంబుబూవి
   యందుఁగూర్చున్న యొక్క జీర్ణాంగిజూ పె

దేవీ ! ఈమె నాకు తల్లి తల్లి. యౌవనదశ యందిట్టి సుందరి యెందును లేదను వాడుకఁ బడసినది. ఇప్పుడెట్లున్నదో చూడుము. ఇదియే జరావికారమని చూపినఁ గాంచి యోగసక్త విస్మయ సాథ్వస వివశహృదయయై యేమీ! ఈమె మనుష్య కాంతయే ? కొంతకాలము సుందరి యని పేరు బొందినదా। నెచ్చెలీ ! నీవుగూడ ముందిట్లగుదువా యేమి ? అక్కటా ముదిమి కడుచెడ్డదియే ? అనియూరక వింతగా నా వృద్ధకాంతంజూడ దొడంగినది.

అప్పుడు జితవతి తల్లీ ! ఇఁకఁదెవుళ్ళ తెఱఁగరసిన నీగుండె పగిలిపోవును. మృత్యుదేవత బ్రహ్మయొద్దకువచ్చి జీవజాలంబులనే సమయింపఁజాలనని దుఃఖించినదఁట. అపుడు పరమేష్టి యామె కన్నీళ్లు దోసిటం బట్టి విరజిమ్ముటయు నాయశ్రుజల కణంబులు నలుమూలలుఁగోట్ల కొలది వ్యాపించినవి. అవియే మహావ్యాధులగుననియు నవినీకు దూతికాకృత్యములఁగావింపఁ గలవనియుజప్పి ప్రష్టయద్దేవినూరడించి యంపెనఁట. ఆబిందుకణము లసంఖ్యాకములైన రోగములై మనుష్యులం బాధించు చున్నవి. అని రోగిప్రవృత్తులం దెలుపు కొన్ని శ్లోకములం జదివినది.

యోగసక్త యా వృత్తాంతమువిని ఛీ ఛీ ! నీ విట్టి యసహ్యపు లోకమున నేమిటికిజనించితివి? మహాభిషుండు పుడమిజన్మించుటకు దుఁఖించిన నేమియో యనుకొంటి. నిరయమన నరలోకమని చెప్పవచ్చును. నీవునన్నిట్లు వరంబడుగుట యుక్తమే. కాని యింద్రుని అనుమతి లేక నాకంబునకు నిన్నుఁ దీసికొనిపోయితినేని నపరాధిని నగుదును. నీవిందుండంగనే నిన్నీ యిక్కట్టు లేవియుం జెందకుండునట్లు ప్రయత్నిం