పుట:కాశీమజిలీకథలు -07.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విభీషణుని కథ

101

మణీ ! విభీషణ శాసనంబున నా విద్యలన్నియు గుప్తము జేయఁబడినవి. ఆ పుస్తకములన్నియు లాగికొని యొక గృహంబున ముద్రలు వేయఁబడినవి. వానిం జదివిన వాని‌ శిక్షింతుము అని యెరింగించెను.

భార్య వెండియు నేదియో యడుగఁబోయిన అతండు కొమ్మా ! నన్ను నిద్రబోనిమ్ము. రేపు పెద్ద విభీషణుఁడు సభకు వచ్చును. పెందలకడ సభకు లేచి పోవలయునని పలుకుచు నిద్రించెను.

ఆ సంవాదము విని వీరసింహుఁడు సంతసించుచు నేనిందురా నొక విశేషము దెలిసినది. ఈ ప్రహస్తుడు అమాత్య ప్రహస్తుని వంశములోనివాఁడు కాఁబోలు. ఈఁతడే యిప్పుడు మంత్రిగానుండెను. రేపు విభీషణమహారాజు సింహాసన మలంకరించునఁట. వీనివెంట నాయోలగంబున కరిగి యాపుణ్యాత్ముని దర్శనముజేసి కృతార్థుండనయ్యెదనని తలంచి యందే యొకచోఁ బండుకొనియెను.

అరుణోదయ సమయమునకే ప్రహస్తుండు లేచి కాలకృత్యంబులు నిర్వర్తించి ద్వారమున వేచియున్న వీరభటులతోఁ గూడ రాజు సభకు బోయెను.

వీరసింహుండును బ్రహస్తుని విడువక యతని వెంట నరగి యా సభలో నొకచో నిలువంబడియెను. అంతకుఁ బూర్వమే పౌరులెల్లరు వచ్చి సభ నలంకరించిరి. మిక్కిలి విశాలమగు నా సభాభవన మంతయు మంత్రిసామంతరహిత పురోహిత స్త్రీబాల వృద్ధరాక్షస వీరులచే నిండింపంబడి యెంతేని దర్శనీయమై యొప్పినది. వీరసింహుఁడా సమ్మర్థములోఁ దప్పించుకొనచుఁ దనకుఁ నిలువఁ జోటెందునను లేమింజేసి క్రమంబున రాజసింహాసనము దాపునకుఁ బోయి యందు సింహాసన మంటప మణిస్తంభమునకాని నిలువంబడి యావింతలం జూచుచుండెను.

సింహాసనమునకు దక్షిణమున అడ్డముగా వేయఁబడిన పీఠంబునఁ బ్రహస్తుండును నుత్తరమున వేయబడిన పీఠంబున జిన్న విభీషణుండును గూర్చుండి వారు మహారాజునకు విన్నవింపఁదగిన విషయంబులన్నియుఁ జర్చింపుచుండిరి.

ఇంతలో భేరీనినాదము సభ్యులకు శ్రవణానందము గావించుటయుఁ జూడ్కులు సభాభవన ద్వారమునకు వ్యాపింపఁ జేసిరి. విభీషణమహారాజు పెక్కండ్రు రాక్షస వృద్ధులు పరివేష్టించి శ్రీరామమంత్ర పారాయణము జేయుచుండ శినికారూఢుండై చను చెంది ద్వారదేశమున దిగి రాక్షసుల నమస్కారము లందుకొనుచు సమున్నతంబగు రత్నవితర్థికపై దూరపు ముఖముగా వేయఁబడియున్న సింహాసన మలంకరించెను. అప్పుడు సభాసదులెల్ల విజయద్వానములతోఁ గరతాళముల వెలయించిరి. ఆపీఠము దావుననున్న వీరసింహుఁడు విభీషణునికి నమస్కరించుచు నిట్లు తలంచెను.