పుట:కాశీమజిలీకథలు -04.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

13]

పాతాళబిలము కథ

97

వర్ణింపఁ బదివత్సరములు పట్టును. ఆహా ! తలంచుకొనినఁ గంపము జనింపుచున్నది. చూడుము. ఏనుఁగు మీదఁ గూర్చుండి యూరేగింపు దంతకుమున్ను మాతో నున్న వారందఱు నేమైరో తెలియదు. మేమిరువురము మాత్రమే యుంటిమి. అప్పుడా చిన్నదాని లజ్జయుడుగ మోమెత్తి పల్కరించితిని. సిగ్గుచే మాటాడినదికాదు. కాని మందహాస విలోకనాంకురములు నాపైఁ బ్రసరింపఁజేయుచు హృద్గతాభిలాషము సూచించినది. అప్పుడు నేను మోహవివశుండనై కౌఁగిలించుకొన యత్నింపు చున్నంతలో నా పాడు దంతావళ మా ప్రవాహము దాపునకుఁ బోయినది. దానికి మావటీఁడు లేఁడు. మేమేమి చేయుదుము. ఎంత యదలించినను దిరిగినది కాదు. ఆ ప్రవాహము నింగిపొడవున నుప్పొంగి మమ్మైక్యముఁ జేసికొనినది. చెఱియొక మూలకుం గొట్టుకొని పోయితిమి. అందొక పెనుమీను త్రోకపై నుండ నన్ను విసరినది ఆ విసరున వచ్చి యిచ్చటఁ బడితిని. పతన వ్యధచేఁ గన్నుల మూసికొనియుండ నింతలో నీవు వచ్చి పిలిచితివి. ఇదియే నా వృత్తాంతము. ఇది కలయో కల్ల యో నిక్కువమో నీవే యూహించి చెప్పుము. ఇదిగో యా మదవతి చిటికిన వ్రేలి యుంగరము నా వ్రేలనున్నది చూడుమని పలికి యూరకుండెను.

అతని చరిత్రమంతయు విని బలభద్రుఁడు ముక్కుపై వ్రేలిడుకొని యొక్క నిమిషము ధ్యానించి అయ్యారే ! యిట్టి చిత్రముల కథల యెందును విని యెఱుంగము. ఇది యేమి మాయయో తెలియదు. తమ్ముడా ! నా కథయు నీ కథనే పోలియున్నది. చెప్పుకొనిన దుఃఖమే కాని లాభము లేదు. దాని మాట యట్లుండనిమ్ము. మన చెల్లె లేమైనది ? ఈ యడవిలో నెందైన మన కొఱకుఁ గ్రుమ్మరుచున్న దేమో వెదకుదము అని పలుకుచు నతనితోఁ గూడ నయ్యడవిలో సుభద్రా ! యని పిలుచుచుఁ దిఱుగఁజొచ్చిరి.

ఇదిగో మహా పాపాత్మురాల నిచ్చటనున్నాను మృతి నొందలేదు. ఇటు రండు అని ధ్వని యొకటి వినంబడినతోడనే నంత వెదకుచు వారా నినాదము --- నరిగి యొక పొదరింటిలో నున్న సుభద్రంగని ------------------- గౌఁగలించుకొని ముద్దు చెల్లెలా ! నిన్నుఁజూడరక యెంత ------------- నీ వెక్కడకుఁ బోయితివి ? నీవు గూడఁ బాతాళ బిలములోఁ బడిపోయితివి గదా ! ఎట్లు బయటకు వచ్చితివి ? నీ కేమేమి వింతలు గనంబడినవి. ----------- ననేకములగు చోద్యములంజూచితిమి. వానినె సావకాశముగాఁ జెప్పుకొని -------------- తెఱంగెఱింగింపుమని యడిగిన నప్పడఁతి వేడి నిట్టూర్పు నిగుడింపుచు ---------- నలుదెసలు చూచి యేదియో ధ్యానించి యల్లన నిట్లనియె.

అన్నలారా ! మీ వెనుక నేనాగోతిలోఁబడి ---------------- దిగజారి దిగజారి యొక సరస్సులోఁ