పుట:కాశీమజిలీకథలు -04.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

96

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

మేనిలో జవసత్వము లేమియుం దరుగలేదు. నిద్రలేచినట్లు లేచి యా పట్టణ మెయ్యదియో చూచెదంగాక యని పురాభిముఖముగా నడువఁ దొడంగితిని. అది పగలో రాత్రియో చెప్పఁజాలను. సూర్యుఁడు కనంబడలేదు. నెలుఁగు పెద్దగానున్నయది. ఆ పట్టణంబునంగల సౌధముల తీరీ రీతినున్నదని చెప్పుటకు నా తరము గాదు. అన్నియు హాటక రత్న ఘటితంబులే కాని పాషాణదారు నిర్మితములు గావు అది స్వర్గము కావచ్చును. ఆ పురిలో వీధింబడి నడుచుచుండ మేడలలోని సంగీతనాదంబులు కర్ణ పర్వము గావించినవి. మేను పరవశమై పోయినది. అందుఁగల జనులు కడురూపవంతులు నన్నెవ్వరును బల్కరించలేదు. నేను పట్టణము నలుమూలలు దిరిగితిని. పోయిన వీథియుఁ బోవలసిన వీథియు నాకు గురుతు తెలయలేదు. వేఱొక మూలకుఁబోయి చూచి నంత నా ప్రాంతమున నొక ప్రవాహము వాయు వేగముగాఁ బ్రవహించు చున్న యది. దానిలో శంకచక్రగదా ధనుర్దారులను దులసీమాలాలం కృతులునగు వైష్ణవులు కొట్టుకొని పోవుచుండిరి. ఆ ప్రవాహమునకును వారికిని దుదియు మొదలును గనంబడలేదు. ఆ ప్రవాహము పొంగుచున్నట్లు కనంబడినంత నేను భయపడుచు మఱియొక మూలకుం బారిపోయితిని.

ఒక వీథిలో నరుగుచుండ నొక సౌధములో మంగళఘోషములు వినంబడినవి. శుభ కార్యము జరుగుచున్నదని తలంచి నేనా లోపలికిఁబోయి తొంగిచూచితిని. వివాహవేదిక యందుఁ బీటలువైచి పెండ్లి చేయుటకు సర్వసిద్ధము గావించియందున్న వారెల్ల బెండ్లికుమారుని రాకకై యెదురు చూచుచుండిరి. నన్నుఁజూచిన వారెల్ల సంభ్రమముతో నదిగో పెండ్లికొడుకు వచ్చినాఁడు. కార్యము జరిగింపుఁడుజరిగింపుఁడని కేకలు వైచిరి. అందులకు నేను వెఱఁగుపడి చూచుచుండ నన్నుఁ దీసికొనిపోయి మంగళ స్నానములు చేయించి పీఁటలపై గూర్చుండఁ బెట్టిరి. వారికిని నాకుఁబ్రశ్నోత్తరము లేమియు జరిగి యుండలేదు. అంతలో బంగారుబొమ్మ యనందగు పొన్ని కొమ్మను దీసికొని వచ్చి నా ప్రక్కం గూర్చుండఁ బెట్టి వివాహ విధి నిర్వర్తించిరి. నేనా చిన్నదానికి మంగళసూత్రము గట్టితిని. తలఁబ్రాలు పోసుకొంటిమి. దాని ప్రాయము పదియాఱేఁడు లుండును. రూపము వర్ణింప సహస్రముఖుఁడైనను జాలఁడు. అన్నా! నీతో ఏమని చెప్పుదును.

ఉ. కన్నులు గల్వరేకులు మొ • గంబుగళానిధి మేని డాల్పదా
    ఱ్వన్నె పసిండి జక్కవక * వం బురడించు గుచద్వయంబహా
    సన్నినికొను ముత్తెముల - చాలు రదాభి మదాభి రైశ్యమ
    న్నన్న ? గణింప శక్యమిత • దాకృతి సోయగ మన్విధాతుకున్.

అప్పుడే మా యుంగరములు మారిపించి చెట్టలు పట్టించిరి. పిమ్మట మమ్మొకయేనుఁగుపై నెక్కించి యూరేగించిరి. ఆ వినోదము లన్నియుఁ గలలో వార్తలని నీకు సంక్షేపముగా జెప్పుచుంటిని. ఆ పెండ్లి కూఁతురు మొగము నొకదాని