పుట:కాశీమజిలీకథలు -04.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12]

మహామాయ కథ

89

గుఱుతుఁ జూచికొని నడుచుచుండిరి. ఆ రీతిఁ బెద్ద తడవు నడిచినను దెల్ల వాఱినది కాదు. అప్పుడు బలభద్రుఁడు, తమ్మునితోఁ గృష్ణా మనము ప్రొద్దు తెలియక పెందలకడలేచి పయనము చేసితిమి. ఎంత సేపటికిని దెల్లవారకున్నది. మబ్బు గ్రమ్మినది కాఁబోలు గగనమున నక్షత్రములు గనంబడుటలేదు. దానంజేసి యంధకార మెక్కువ యగుచున్నయది. గుఱ్ఱములు దారి తెలియక తొట్రుపడుచున్న యవి. సుభద్ర గుఱ్ఱము నడిభాగమున దాపుగా నడిపింపు మనుము. ఈయంధకారము మనబోఁటులకు భీతిగలుగఁ జేయుచున్నదని పలుకుచు గుఱ్ఱము మెల్లఁగా నడిపింపఁదొడంగెను. ఎంత సేపటికిఁ దెల్లవాఱినది కాదు. చీఁకటి క్రమక్రమముగా వృద్ధికాఁ జొచ్చినది . మార్గము తప్పినది పొదలు వృక్షములు లతలు గమనమునకు నంతరాయముఁ గలుగఁ జేయఁ దొడంగినవి. గుఱ్ఱములు ముందు తెరపిగానక యొకచో నిలువంబడినవి. అప్పుడు వారు వాఱువముల దిగి చూడ భూమియంతయుఁ గంటకావృతమైయున్న యది అడుగు పెట్టుటకుఁ జోటు దొరికినదికాదు. విస్మయ సాధ్వసంబుల చిత్తం బుత్తల పెట్టఁదత్తరముతో మెల్లన నడుగులిడి కంటకంబులఁ దప్పించుకొని యొకచోఁ గూర్చుండి మన్నును మిన్నునుగానక దిగ్ర్భమఁ జెందుచు లోకబాంధవునిరాకకై యెదురు చూచుచుండిరి.

వారు గగనముదెస మొగములు పెట్టుకొని చూచుచుండ నెంతవేళకుఁ దెల్లవాఱుజాడఁ గనంబడినదికాదు. అప్పుడు సందియము గలిగి బలభద్రుడు తమ్ముడా ! ఇది ప్రళయమువలెఁ గనంబడుచున్నది. మనము బయలుదేఱిన వేళను బట్టిచూడ నేఁడెనిమిది జాములై నట్లున్నది. అక్కడఁ దెల్లవాఱుచుండఁగ బయలు వెడలితిమి. చీఁకటి క్రమముగా నధికమగుచున్నది. కాని తెల్లవారు జాడఁ గనంబడదు. అది యేమి యుపద్రవమో తెలియదు. మన మిప్పుడు నిద్రఁబోవు చున్నామేమో? స్వప్నములో నీలాగున వింతలు కనంబడును. నీ మదికిట్లు తోఁచుచున్న దేమో చెప్పమని యడిగినఁ గృష్ణుండు విస్మయ మభినయించుచు నిట్లనియె "అన్నా! నీవన్న ట్లిది యకాండప్రళయమువలె నున్నది. దీని స్వప్నమని యెట్లు చెప్పనగు. మనము మువ్వురము ద్వారవతినుండి గుఱ్ఱము లెక్కి బయలుదేఱి వచ్చితిమి గదా! నిద్ర యెక్కడఁ బోయితిమి. నిద్రలేనిదే స్వప్నము వచ్చునా? ఇది యేదియో యింద్రజాలము కాని యదార్ధము కాదు' అని పలికెను. అప్పుడు సుభద్ర విస్మయ మభినయించుచు “అన్నలారా! ఇది యింద్ర జాలమును స్వప్నమును గాదు. దీనిని దైవమాయ యని యూహింపుడు మనము దైవము లేఁదనియు వేదశాస్త్ర పురాణాదులు మృషలనియు బుణ్యతీర్థములు మనుష్యకల్పితమనియు నిందించుచు నాస్తికమతము స్వీకరించి బయలు వెడలితిమి. దానంజేసి భగవంతుఁడు తన మాయ యిట్టి ప్రదేశమున మనల మహాంధకారకూపంబునఁ బడవైచినాఁడు. కానని నిద్దచీకఁటి యెన్నడైన జూచితిమా! ఇంతసేపు తెల్లవారకుండునా పెద్దతడవె నట్లు మన