పుట:కాశీమజిలీకథలు -04.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

88

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

విశేష మేదియు నాకుఁ గనంబడలేదు. తరువాత నేను హరిద్వారమునకుఁ బోయితిని. అచ్చట మహాపందయున్నదని చెప్పఁగాఁ దన్మాహత్మ్యమును విమర్శించితిని. అదియును బూటకమే యైనది.

అచ్చటనుండి గంగోత్తర కరిగితిని. అందు మన చెల్లెలు సుభద్ర కనంబడినది. దానిని నేను గుఱుతుపట్టలేకపోయితిని. నన్నది గుఱుతుపట్టి నా యొద్దకు వచ్చినది. మేమిద్దరము చూచి వచ్చిన విశేషములం జెప్పుకొనుచు రెండు దినములందు వసించితిమి. అదియు శక్తి క్షేత్రములన్నియుం జూచి వచ్చినదఁట. ఏ దైవ శక్తియు గనంబడలేదని చెప్పినది. తరువాత మేమునీ జాడఁ దెలిసికొనుచు నింటికిఁ బోవలయునని నిశ్చయించి బయలుదేరితిమి. ద్వారవతి విష్ణుక్షేత్రమగుట నీ విందుండుదువేమో యని యరసిపోవ నీయూరు వచ్చితిని. సుభద్ర యీ ప్రాంతమందొక శక్తిక్షేత్రం బున్నదని యెవ్వరో చెప్పఁగా నది చూచి వత్తునని యరిగినది. రాత్రికి మనలం గలిసికొనఁగలదని యా వృత్తాంతమంతయుం జప్పెను. ఆ చరిత్రమంతయుం విని బలభద్రుండు "తమ్ముఁడా? మన మాకాశకుసుమంబునకుంబోలె లేని వస్తువునకై వృధాశ్రమ పడితిమి. మన తండ్రి మనలం గానక యెంత చింతించు చుండునోకదా? మన మిల్లువెడలి సంవత్సరము కావచ్చినది. ఏదియో గొప్ప ప్రయోజనము నిర్వాహకముఁ జేసికొనిపోయి యెక్కుడు పేరు పొందవలయునని తలంచితిమి. అంతయు దబ్బర, దైవమేలేఁడు. స్వభావము చేతనే యీ ప్రపంచకము సృష్టి స్థితిలయములఁ బొందు చున్నదఁట? దీప మాఱిపోవునట్లు మనుష్యుడు చచ్చుచుండును. పునర్జన్మాదులు లేవు. సుకృత దుష్కృతముల మాటకల్ల. సుఖమే స్వర్గము. దుఃఖమే నరకము. ఆనందమే ముక్తి. ఇంతకన్న వేఱొక మోక్షము లేదు అని యొక క్షేత్రంబునఁ వారసిల్లిన చార్వాక సిద్ధాంతి యొకఁడు చెప్పియున్నాఁడు. అప్పుడతని మాటలు పాటించ నైతిని గాని యిప్పుడవియే నిక్కువములని తోఁచుచున్నవి. ఈ క్షేత్రములన్నియు దైవముల పేరు చెప్పి ధనము లాగుటకై మనుష్యులచేఁ గల్పింపబడినవి. కాకున్న నొక చోటనైన నించుకయు దృష్టాంతము గనంబడకుండునా ? మన పురాణగాథలు వినినచో దైవము భక్తుల వెంట దిరుగుచున్నట్లు స్పష్టమగుచున్నది. అవి యన్నియు కల్పితములు. మన మీపాటికి నింటికింజని నాస్తికమతమె యవలంబింతుము దాన సౌఖ్యము మెండుగా గలుగునని యుపన్యసించిన విని కృష్ణుండును దాని కనుమోదించెను. ఇంతలో సాయంకాల మగుటయు సుభద్ర వచ్చి వారితోఁ గలసికొనినది. ఆ రాత్రి యెల్ల వారు తాము చూచిన వింతల నొండొరుల కెఱింగించుకొనుచుఁ ద్రుటిగా వెళ్ళించిరి.

అమ్మఱునాఁడు రాత్రి వారు స్వదేశగమనలాలసులై ప్రయాణసన్నాహముఁ జేసికొని జాము ప్రొద్దున లేచి గుఱ్ఱము లెక్కి తూరుపు ముఖముగా నడువఁదొడంగిరి. అప్పటికిఁ చీఁకటిగానున్నను నక్షత్రముల వెలుతురున మార్గము