పుట:కాశీమజిలీకథలు -04.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మహామాయ కథ

85

రాజ — ఆ మాటలు మానివేయుఁడు ఆమె మీ కేమైనఁ బ్రత్యక్షమగుచున్నదియా?

శా -- కాకేమి పెక్కుసారులు కనంబడినది! నిరుడు మశూచి రోగములు వ్యాపించినప్పుడు డెందరికోఁ బూనినది. ఆమె యప్పుడు రక్షింపనిచో నీపాటికి మనపట్టణము శూన్యమే యగును.

వైష్ణవులు శైవులు (లేచి) అయ్యా! వట్టిది అది క్షుద్రదేవత చాకలివాండ్రకును మంగలివాండ్రకును మహాశక్తి ప్రత్యక్షమగునా. కోడిపుంజులకై వాడ్రూరక సివమాడుచుందురు. అది నిజముకాదు మీ యెదుటఁ బ్రత్యక్షముఁ జూపుఁడని యడుగుఁడు.

రాజ - నవ్వుచు వారింగూర్చుండ నియమించి శాక్తేయులతో అయ్యా ! చాకలివాండ్రకు మహాశక్తి ప్రత్యక్షమైనదని మీరు చెప్పుచున్నారు. అది యెంత యుక్తముగా నున్నదియో యాలోచింపుడు. మీ వాదమె మీరుమరచితిరి. శక్తి జగత్కారణురాలను దృఢపఱచవలయును. ఆ విషయము మాకు బ్రత్యక్షముగాఁ జూపవలయును. మీకు సమర్థతయున్నదా చెప్పుఁడు. లేకున్న దూరముగాఁ గూర్చుండుఁడు తెలిసినదా?

శా - చిత్తము చిత్తము తెలిసినది. తత్ప్రభావము శక్తి క్షేత్రముల కరిగిన స్పష్టమగునుగాని యిక్కడంతగా దెల్ల ముకాదు.

రాజ - శక్తి క్షేత్రములేవి ?

శా – కాశీ కొల్హాపురము కాంచి శ్రీశైలము లోనగునవి.

రాజ — సంతోషించితిమికాని మీ మూఁడు మతములలోఁ గూడ బ్రధానత్వము నిశ్చయించుటకు వీలులేదు. ఇప్పటికి మీరు నిలయంబులకుఁ బోవచ్చును. అందలి నిక్కువము మేమరసి ముందు మీకుఁ దెలియఁజేయుదుము. పొండని యా రాజపుత్రు లంతటితో సభముగించిరి.

రాజపుత్రు లేమతమును ప్రధానముగా నిశ్చయింపలేదు. కావున నా మూఁడు మతములవారును సంతోషముతోఁ దమతమ నెలవులకుంబోయిరి. అమ్మఱునాఁడు వివిక్తప్రదేశమున వసియించి బలభద్రుఁడు తమ్మునితోఁ గృష్ణా! వీరి వాదముల వినవిన నెవ్వరికిని సత్యము దెలియదని తోచుచున్నది. వెనుకటి కథల ననుసరించి వీరు వారివారికి నభిమతమైన దేవతల నాశ్రయించుచున్నారు. ఈ విషయము మహర్షులు సైతము నిశ్చయింపలేక పోయిరట దైవమాయన నేమియును లేనిది. తెలియక యేమోయనుకొనుచున్నారు గదా! అన్యదుర్లంభంబైన యిక్కార్యంబు మనము సాధించుకొని వచ్చితిమేని బ్రజ్ఞావంతులమగుదుము. ఇప్పుడు వీరుచెప్పిన దివ్యక్షేత్రములయందుఁ దన్మహత్త్వము విశదముకాకమానదు. పత్యక్షముఁ జూచి