పుట:కాశీమజిలీకథలు -04.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10]

పండితరాయలకథ

73

పండితరాయల కథ

ఆర్యా ! నేను మీ పాదసేవకురాలనై మీతోఁ గ్రుమ్మఱుచుందును. మా సఖురాలు జేసిన తప్పు మన్నింప వేఁడుచున్నదానను అక్కలికి పిలిచినంతనే యాత్మాపరాధియగు తండ్రియింటి కరిగినదని మీకుఁ గోపము వచ్చినది. ఎటులయినను స్త్రీ చాపల్యము పోవదుగదా? నేను బోయి తీసికొని వచ్చెద ననుజ్ఞ యిండని వేఁడుకొనిన నతండు కానిమ్ము ప్రస్తుతము పోవలదు. అట్టికాలము రాఁగలదు. చూచుచుండుమని పలికెను. ఆ మాటలన్నియు నొకయుత్తరము వ్రాసి యా పురుషుండు గురువునొద్ద కనిపెను. ఆఫకీ రాసందేశము తెలిసికొని లవంగియొద్దకుం బోయి "తల్లి! నీ భర్తకు మనపైఁ గోపము వచ్చినదఁట. నీవు పుట్టినింటికి వచ్చితివని యాక్షేపించుచుఁ జక్రవర్తిపై గత్తిగట్ట సిద్దపడుచున్నవాఁడని జాబు వచ్చినది. అతం డలిగిన నెంతపనియైనం జేయఁగలడు. అతని కోపమెట్లు శాంతించునో యట్లు చేయవలయును. చక్రవర్తి యతని యొద్ధకు బోయి యపరాధము చేసితిని. రక్షింపుమని ప్రార్దించినచోఁ గార్యము సమకూరును లేనిచోఁ దగనిచిక్కులు పడవలసి వచ్చును. అతని చరిత్ర మంతయు విని యుంటిని కావున నింత చెప్పుచున్నాఁడఁ దరువాత నీవే యాలోచించుకొనుమని" చెప్పెను. పుత్రికపైఁ జక్రవర్తి మునుపటికంటె నెక్కుడు ప్రేమ గలిగి యున్నవాఁడు కావున లవంగి తండ్రి యొద్ద కరిగి నాయనా ! నీ యల్లుడు త్రిలోకపూజ్యుఁడు పరాక్రమమున నింద్రునికన్న నెక్కువవాఁడు రూపమున మన్మథుని దిరస్కరించును. బుద్దిని బృహస్పతి యనియే చెప్పఁదగిన సాధుశీలుండు సత్యసంధుండు. ఉత్తమ వంశసంజాతుండు అట్టివాఁడు నీ కల్లుఁ డగుటయే చాలును. పాత్రలాభము కలిగినది. నీవు ద్రోహము చేసినను బుత్రికను గనుక యీసు బూనక పిలిచినంతనే వచ్చితినికాని యాయన యంతమాత్రమున సంతసించునా? న న్నాక్షేపించుచు నీపైఁ గత్తిగట్టుటకు సిద్ధముగ నున్నారట. ఎటు ప్రమాదము వచ్చినను నాకే గదా కొదవ ఇది వఱకు పడినయిడుములు చాలవా? నీ వాయన యున్నచోటికిఁ బోయి బ్రతిమాలుకొని తీసికొని రావలయు. నిప్పు డిదియే కర్జము. అల్లుఁ డలుగుటయు మామ తీర్చుటయు లోకాచారమై యున్నదని యుక్తియుక్తముగాఁ జెప్పి యతని నొప్పించినది.

పిమ్మట ఫాదుషా చక్రవర్తి చతురంగబలపరివృతుండై మంత్రిసామంతాదిపరిజనము సేవింప ముసలిఫకీరుతోడ తాఁ బండితరాయలున్న గ్రామమున కనతిదూరమున నందలము దిగి పాదచారియై యతనియొద్దకుం జని పాదములమీఁద దల యిడి మహాత్మా! నేను మీ సామర్ధ్యము తెలియక -------------ఈ బాలుండు నాకు దౌహిత్రుడు. ---------- నా యింటికి విచ్చేయుము. నాతప్పులన్ని--------