పుట:కాశీమజిలీకథలు -04.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

70

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

ణంబులు పరికించితిని. ఏమి చెప్పను నెచ్చటను మీ దర్శనమైనదికాదు. ఈ హరిద్వారమునకు రెండుసారులు వచ్చితిని.

కేదార మాఱుసారులు పోయితిని. సన్యాసులను ఫకీరులను బైరాగులను వేనవేలను బరీక్షించితిని. ఎప్పటి కే కార్యము సఫలము కావలయునో యప్పుడుకాక వేయి ప్రయత్నములు చేసినను లాభములేదు. కొందరు ఫకీరులవలన మీ జాడలు తెలిసికొని యిక్కడికి వచ్చితిని. దైవానుగ్రహముచే నిందు మిమ్ముఁ బొడగంటి. ఈ బాలుండు నీ పుత్రుండు ముసలి ఫకీరుచే నంతయుం తెలిసికొంటిని. మీకు శుభోదర్కము సూచనలయగుచున్నది. వేగమవచ్చి లవంగిని జూడుడు. మీ విరహమున నా తరుణీరత్నమునకుఁ గలుగు పరితాపమింతింతయని చెప్ప నా తరముకాదు. ఇంక ముందరి కార్యమునకు దేవరయే ప్రయాణ మని యూరకొనినది.

ఆ మాటలువిని పండితరాయ లమృతహ్రదంబున మునింగిన యట్లొకింత తడవు మాటాడనేరక హర్షపులకితగాంత్రుండై సంతోష గద్గదస్వరముతో కుందలతిలకా! ఇట్టి సంతోషవార్త జెప్పిన నీకిచ్చుటకు నా యొద్ద నేమియునులేదు. జీవితకాలమువఱకుఁ గృతజ్ఞుడనై యుండుటయే దీనికిఁ బ్రతిఫలము మా నిమిత్తము మీ యిరువురు మొదటినుండియుఁ గష్టములఁ బడుచున్నవారు దైవమును మీఱినవాఁ డెవ్వడునులేడు. ఆహా! విధి విచిత్రసంఘటనలఁ గావించుచుండును గదా! అయ్యరే! మనుష్యమాంసఖాదియైన భల్లూకము బాలునెత్తుకొనిపోయి తనపిల్లవలెఁ బెంచుట యెన్నడైన వింటిమా! కంటిమా! నేనాగుహకే పోవలయునా ? ఓహో! భగవంతుని యద్భుత ప్రభావ మెవ్వఁడు తెలిసికొనఁగలడు ? అని పెక్కుగతుల విస్మయముఁ జెందుచు లవంగిం జూచు నుత్సాహము డెందమ్మున ముమ్మరమగుచుండ నతం డప్పుడే పయనంబై యా బాలునెత్తుకొని కుందల తిలకవెంట నడుచుచుండఁ గతిపయప్రయాణంబుల ఫకీరులున్న గ్రామము జేరెను.

కుందలతిలక పండితరాయలను బుత్రికలతోఁగూడ నొకచోట గూర్చుండఁ బెట్టి లవంగిని బరిహాస మాడదలంచి ముందుగా మసీదునకుఁపోయి చూచినదికాని యందెవ్వరును గనంబడలేదు. ఇంతలో నెవ్వఁడో యొకం డచ్చటికి వచ్చినం జూచి వానితో అయ్యా! ఇందొక ముసలిఫకీరును నాయనతో నిద్దరుముద్దియలు నుండవలయును. వారెందుబోయిరో యెఱుంగుదురా యని యడిగిన నతఁ డెరుంగుదును. నీ వెవ్వతెవు? లవంగి సఖురాలవా యేమి? అని యడిగిన వెఱగుపడుచు నాపడుచు నోహో! ఈతండు లవంగిపేరు చెప్పుచున్నాఁడే? గుట్టుబయలయ్యెనాయేమి? రాజభటులు తెలిసికొని యా పొన్ని కొమ్మం బరిమార్పలేదుగద. అయ్యో? ఏమని చెప్పుదును. ఏమిముప్పు మూడినదో యని యాలోచించుచుండ వెండియు నతం డిట్లనియే.

నీవు సంశయింపనక్కఱలేదు. నీవృత్తాంత మంతయుఁ దెలిసినది. ఆవిప్రకుమారుండు కుమారునితో నీకు గనంబడియెనా? ఇచ్చటికిఁ దీసికొనివచ్చితివా? నేనా