పుట:కాశీమజిలీకథలు -04.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుందలతిలక కథ

67

వానికిని మొండిధైర్యము గలుగునుగదా? అడుగునకుఁ బదుగురు తోడువచ్చెడు నప్పడఁతి యా రేయివాఱు మసకం ఆ గర్భముతోఁ జీకటిలో నా చేయిపట్టుకొని వడి వడి నడువఁదొడంగినది. కాలగతి యెట్టిదో చూడుము. తెల్లవాఱువఱకొక పల్లెం జేరితిమి. ఆనారికాళులు పొక్కులెక్కి యాపైన నొక్కడుగు నడువలేక చతికిలఁబడినది అప్పుడు నే నొకచోట బరుండబెట్టి కొంత ద్రవ్యము తీసికొనిపోయితిమిఁ కావున దాన భోజనసామాగ్రి సంపాదించి వంటఁజేసి భోజనముపెట్టి యాయాసము వాయ సాయంకాలమువఱకుఁ బాదముల నొత్తుచుంటిని. ఆ చిన్నది యాదినమునఁ గదలలేకపోయినది.

మఱుఁనా డుదయకాలమున నెట్టకే బయనము సాగించితిమి. అడు గామడ లాగున నడువఁదొడగినది. చెట్టునీడలఁ గూర్చుండి యెట్టికేలకు నా నిర్భంధముమీఁద గదలుఁచు గ్రమ్మఱ నవ్వలి చెట్లనీడ నిలిచి సఖి! యీ రీతి నెంతదూరము నడువ వలయును. అయ్యో? కాశీపుర మెంతదూరమున్నది? మునుపు వేగముగా జేరితిమే? యని పలుకఁగా నేను శంకించుచు దాపుగానే యున్నది. రేపు చేరుదుము. అడుగు వేయుము కూర్చుండిన నడవిలోఁ బ్రొద్దుగ్రుంకును. వెనుకనుండి యెవ్వరేని వత్తురేమో యని పెక్కు తెఱంగుల బ్రతిమాలగాఁ గదలి నాలుగడుగులు నడచి యిఁక నన్నుఁ జంపినను నడువఁజాలను. పైఁ బయనము రేపుపోవుదము. మృగములు తినుఁగాక కదలలేనని యీడిగిలం బడినది. అప్పటి నా శ్రమ యేమిచెప్పుదును. రెండు మూఁ డామడలు మాత్రము చుఱుకుగా నడిచినది. పిమ్మట దివసమున కొక క్రోశమైనను నడువలేక పోయినది. బండ్లు మొదలైన యానసాధనములా త్రోవం బోవనేరవు పెక్కులేల? ఆఱుమాసములకుఁ బదియామడ పోయితిమి. గర్భ మెదగిన కొలది నడువలేకపోయినది. ఒక్కొక్కచోటఁ బదేసి దినములు వసించితిమి. ఆగమనశ్రమకన్న మరణమే శ్రేయమని తోఁచినది. ఒకనాఁ డొక యగ్రహారముఁ జేరితిమి లవంగికి నెలలు నిండినవి. కావునం బైననరుగ బయనము జాలించి యందొక యుత్తమబ్రాహ్మణునింజూచి వినయముతో "అయ్యా ! మేము బ్రాహ్మణులము. మా మగవారు కాశీలో నున్నారు. ఈ చిన్నది నాకుఁ దోఁబుట్టువు. మగని యొద్దనుండి దీసికొని పోవుచున్నాను. ఇప్పుడు ప్రసవ సమయమైనది. మీ యింటఁ బురుడు పోసికొనియెనను, మీఱేమియు సహాయము చేయనక్కరలేదు. బసమాత్ర మియ్యవలయునని ప్రార్దించిన సమ్మతించి యా విప్రుండు మమ్ముఁ దన యింటికి దీసికొనిపోయి యాదరించెను. మఱి నాలుగుదినములకే లవంగి ప్రసవమై మంచి ముహూర్తమునఁ జక్కని పుత్రుంగనినది. ఆ బాలుడు బాలసూర్యుండువోలె పుట్టినప్పుడే సూతికాగృహముఁ బ్రకాశింపఁ జేసెను. నేనును సంతోషముతోఁ బురుడు బోసితిని సుఖముగాఁ బది దినములు గడచినవి. రెండు నెలలుమాత్రము సుఖముగా నందుంటిమి. అచ్చట విప్రులు విప్రాంగనలు మమ్ముఁ జాల గౌరవముగాఁ జూచు