పుట:కాశీమజిలీకథలు -04.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

9]

భల్లూకదత్తుని కథ

65

బున మునుంగ కుందునా? దయతో నీ దీనుని మొర నాలించి రక్షించి యా వృత్తాంత మెఱింగింపుఁడని యాతురముతో వేఁడికొనియెను.

వాని వలవంతకుఁ జింతపడుచు నా విరాగి అయ్యా! నేనా తొయ్యలి వార్త యెఱుంగను. నీ ముఖచిహ్నములం జూచి యట్లంటి దొందరపడకుము తరువుల గుసుమాదికములు ప్రాప్తించినట్ల ప్రయత్నముననే శుభములు చేకూరును సర్వవిద్యాపారంగతుండవు నీ వెరుంగవా? యని పలికి యంతటితో నా ప్రసంగము విరమించెను. పండితరాయలు ముసలి ఫకీరుతో ముచ్చటించుచు నా బాలునితోఁ గూడఁ గొన్ని దినంబులందుండి యతని యనుమతివడసి యచ్చటనుండి బయలుదేరి యనేకదేశములు తిరుగుచు హరిద్వారమునకు వచ్చెను. అప్పటి కాబాలుండు సంవత్సరము ప్రాయము గలవాఁడయ్యెను. వానిముద్దు మాటలు నాటలు నవ్వులు విలాసములై పండితరాయలకుఁ గాలక్షేపముగా నుండెను. ఒకనాఁ డతం డాబాలునితో నాడుకొనుచుండఁగా గుందలతిలక యచ్చటికి వచ్చి యబ్బురపాటుతో నబ్బాలుని నెత్తుకొని ముద్దాడఁదొడంగినది. అప్పండితుం డాచిగురుబోఁణిఁ జూచి గుఱుతుపట్టి డగ్గుత్తికతో బోఁటీ? నన్ను గురుతుపట్టితివా? నీ సఖురా లేమైనది? నేనువోలె నీవుసైతము నానాతినిమిత్తము తిరుగుచుంటివి కాఁబోలు. నీ మాటవిని వెంటనే రాకపోవుటచే నింతవచ్చినది. ఏమి చేయుదుమని కన్నీరుకార్చిన, నవ్వుచుఁ గుందలతిలక యిట్లనియె. ఆర్యా! నీవు విచారింపకుము. మా సఖురాలు సేమముగా నున్నది. పుత్రుంగనినది. ఈ ముద్దుపట్టి మా ముద్దియ పట్టయని చెప్పిన విని కన్నులు నిటల మతిక్రమింప నేనేమీ లవంగి సుఖియైయున్నదా? సత్యమే, ఎక్కడనున్నది? నీ విక్కడి కెట్లువచ్చితివి? ఆ కథయంతయు సవిస్తరముగాఁ జెప్పుమని యడిగిన నయ్యువతి యిట్లని చెప్పందొడంగినది.

కుందలతిలకకథ

నేను మీ యొద్ధ సెలవు పుచ్చుకొని ఢిల్లీకిఁబోయి యందు లవంగియున్న యుద్యానవనమునకుం జనితిని. లవంగియు సంగీతచంద్రికయు నాకుఁ గనంబడలేదు. అక్కడివారల నడిగినఁ దండ్రి లవంగి చేసిన దుర్నయము తెలిసికొని గర్భవతియని సంశయింపక చంపించెనని యొకరు నాతో రహస్యముగాఁ జెప్పిరి. ఆమాట విని నేనడలుచుఁ దిరుగ మీ యూరు వచ్చి మిమ్ము విమర్శించితిని మీ జాడ తెలియక మీ తల్లిదండ్రులు విచారించుచున్నారు. అప్పుడు తిరుగ నేను ఢిల్లీకిఁబోయితిని. అందు మీ వృత్తాంత మేమియుఁ తెలిసినదికాదు. ఏమి చేయుటకుం దోచక • 11 - 10. కొన్నిమాసములుతిరిగినంత నొకనాఁడొక గ్రామము ... . . . . . . " సం . . . ........ d iv. . న న యా చేడియ యచ్చటికెట్లు- ... తలంచుచు నిలువంబడి