పుట:కాశీమజిలీకథలు -04.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

64

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

లయు? నీ వృత్తాంత మెట్టిదని యడిగిన నతండు నిట్టూర్పు నిగుడించుచు నిట్లనియెను. అయ్యా! నా వృత్తాంతము కడునసహ్యమైనది. దానితో మీకేమిపని. ఈ బాలుండడవిలో వచ్చుచుండ నొక కొండబిలములో దొరకెను వీఁడెవ్వఁడో తెలియదు. ఎలుగుబంటి వీని మోసము చేయునేమోయని తీసికొని వచ్చితిని. దిక్కుమాలిన వీనిం జూచి నెవ్వనికిఁ దయగలుగకుండెడిని. జడభరతునకు లేఁడిపిల్ల దొరికినట్లు వీఁడు నాకు దొరకెను. ఏమి జరుగునో తెలియదు. వీని భల్లూకదత్తుఁడని పిలుచుచుంటి నిదియే వీని వృత్తాంతమని చెప్పెను.

ఆ ముసలి ఫకీరు బాలుని చరిత్రము విని మిగుల విస్మయముఁ జెందుచుఁ గానిమ్ము. ఈ యర్బకుని వృత్తాంతము వింతయైనదే ? నీ చరిత్రము వినవేడుక యగుచున్నది. నీవు ఫకీరువైకూడ హిందూమత విషయము చర్చించు చుంటివి. భల్లూకదత్తుఁడిను నామము సంస్కృత భాషలోనిది. జడభరతుని కథ హిందూమతములోనిదే నీ వృత్తాంత మెట్టిదో వినవేడుక యగుచున్నది. నీ కాపురం బెచ్చట! తలిదండ్రు లెవ్వరని యడిగిన విని యతండల్లన నిట్లనియె.

నీవు మిగుల వృద్ధుండువు. నీలో నెద్దియో మహిమ యుండక పోవదు. నీతో నసత్యము లాడరాదు. వినుము. నాది కాశీపురము బ్రాహ్మణుఁడను మా తండ్రి పేరు పండితభట్టు. మా తండ్రికి నేడ్గురు పుత్రులు పుట్టి చచ్చిరి. వారి వెనుకఁ గుల ముద్దరించుకొఱకు నేనుదయించితిని. ఎవ్వరో మీవంటి ఫకీరు వచ్చి మా తల్లికి రక్షరే కిచ్చిన నేనుజావక బ్రతికితిని. హిందూమతవిద్య లన్నియుం జదివితిని యవనవిద్యలం దెలిసికొంటి. పాదుషాగారితోఁ గలహించి గెలుపుఁగొంటిని. ఆయన కూఁతుం బెండ్లి యాడితిని. అయింతి నా మూలమున గర్భవతియై తండ్రిచే బలాత్కారముగాఁ జంపబడినది. ఆ యింతికై నేను బ్రాణములు విడువలేక ఫకీరునై తిరుగుచుంటి నిదియే నాయథార్దమైన వృత్తాంతమని చెప్పెను. అప్పుడా నృద్ధుండు వానింగౌగలించుకొని అప్పా! నీవా తెలిసికొంటిని. నేనే మీ తల్లికి మంత్రోపదేశముఁ జేసితిని. అయ్యో! తిరిగి నే నామె జూడలేకపోయితిని. పాప మాదంపతులు సంతతినిమిత్తమై పెక్కుచిక్కులం బడిరి. బ్రతికినను నీవును దుఃఖప్రదుండవే యైతివి కానిమ్ము. గతమునకు వగవరాదు చక్రచార్తి గర్భవతియైన పుత్రికను జంపించినది నీవు చూచితివాఁ ఇతరులచే వింటివా? నీ మొగముజూడ మంచిలక్షణములు గసంబడుచున్నవి. నీకు శుభమయ్యెడు విచారింపకుమని యోదార్చును.

అతని మాటలు విని పండితరాయలు వెఱుఁగుపడుచు పెక్కు సలాములు చేసి స్వామీ! నేను మీ కాప్తుండనేకదా? లవంగిని జంపించెనని వింటిని గాని చూడలేదు. బ్రతికియున్నదా యేమి? అట్టి యదృష్టము నాకుఁ బట్టునా? మీరెట్లు గ్రహించితిరి? ఎక్కడనున్నది. ఆ చిన్నది నా కన్నులం బడినచో బ్రహ్మానందసాగరం