పుట:కాశీమజిలీకథలు -04.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

62

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

మారు చూడవుగదా. మఱియు వారిని లేనిపోని స్తోత్రములు చేయవు వారియొక్క గర్వాలాపములు లాలింపవు. వారివెంటఁ బరుగిడపు. ఆకలియైనప్పుడు లేతతృణములను దిందువు. నిద్రవచ్చినప్పుడు నిద్రపోవుదువు. ఇట్టిసౌఖ్యము కలుగుటకు నీ వెచ్చోట నెట్టి తపముఁ గావించితివో నాకుఁజెప్పుము. నేను సైత మట్టి ప్రయత్నము జేయుదునుగదా. గోపా! యా పండిత శిఖామణి యిట్టి శ్లోకములు వేనవేలు రచియించెను. దానికే పండితరాయ శతకమనిపేరు. మృదుమధురశైలితో నొప్పుచుండెడి యతని కవిత్వము మిక్కిలి గొనియాడఁదగియున్నది. దద్విశేషముల జెప్పుటకిప్పు డవకాశము చాలదు. తదనంతర వృత్తాంత మాలింపుము.

భల్లూకదత్తునికథ

ఒకనాఁడతం డొకయరణ్య మార్గంబునం బడిపోవుచుండ నొక దండఁగొండ యొకటి కనంబడినది. వాఁడు మెండుగా నెండతగిలి యలసటఁజెంది యుండుటచే నతం డా కొండకోనలోఁ జల్లగానుండునని తలంచి మార్గమువిడిచి యగ్గిరిపడి నడిభాగమున కరిగెను. అందుగల ఫలములచే నాఁకలియడంచుకొని సెలయేటిలో నీరు ద్రావి విశ్రమింప నటునిటు తిరుగుచుండ నొకమూల గుహయొకటి కనంబడినది. సంతసములో నా బిలములోనికిఁ గొంచెము దూరముపోయి యించుక చీకటిగా నున్నంత నందొకశిలపై శయనించి గహాముఖమువంకఁ జూచుచునెద్దియో ధ్యానించుచుండెను. అంతలో నొకభల్లూకము చేతులతోఁ దేనెపట్టు పట్టుకొని యాపట్టుంగల యీఁగల నోటితోఁ దొలగించుచు గాశులతో నడచి యాగుహలోకి వచ్చినది. పరాక్రమశాలియు నసహాయాశూరుండునగు పండితరాయలు దానింజూచి జడియక యిది తన చెంతకు వచ్చినప్పుడు తన ప్రక్కనునిచికొనిన బడియతో మోదఁ దలంచుకొని సవరించుకొనియుండెను. ఆ భల్లూకము చీఁకటిలో నతనియునికి యెఱుంగక యల్లన యగ్గుహలో నొకవంక గోడదాపునకుఁ బోయినది. అందుగఁల గూటిలో లేజిగుళ్ళచే నమరింపఁబడిన సెజ్జపై నొక శిశువు నిద్రబోవుచుండెను. ఆ భల్లూక మాగూటి యొద్దకుఁ పోయి యందుఁగల పాపని ముట్టితో ముట్టిన నాపట్టి కేరున నేడువఁ దొడంగెను. పిమ్మట నా మృగమా శిశువునోట దాఁదెచ్చిన తేనెయట్టను తేనెపడునట్లుపిండెను. ఆ మధుబిందువులనుఁ గ్రోలి యాశిశువాకలి యుడిగినంత సంతోషముతో నవ్వుచుండెను.

అప్పు డాయెలుఁగుబంటి యాడింభకుని మెల్లఁగ నెత్తుకొని యిటునటు కొంతసేపు త్రిప్పి ముద్దాడి తాదెచ్చిన చిగురుటాకులఁ బఱచి మఱల నా గూటిలో నా యర్భకుని బరుండబెట్టిఁ జోకొట్టి యెక్కడికోపోయెను. ఆ వింత యంతయు గన్నులారఁజూచి పండితరాయలు మిగుల విస్మయము నొందుచు నాహా! భగవంతుని సృష్టి వైచిత్యము దెలిసికొన శక్యమైనది కాదుగదా? మనుష్యులువోలె మృగములును