పుట:కాశీమజిలీకథలు -04.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఢిల్లీ పాదుషాగారి కథ

61

నొందుటయొండె విరక్తి నొందుటయొండె గర్తవ్యమని పెక్కు తెఱంగులఁ బలవరించుచు నతండు నిద్రబోఁవక యా రాత్రియే యా వీడువిడిచి యొక యరణ్యమార్గంబునంబడి పోవఁదొడంగెను. పండితరాయలు విరక్తుండై కొన్ని దినంబు లరణ్యసంచారము గావించెను. అప్పుడు కనంబడిన పక్షులను మృగములను గుఱించి యనేక శ్లోకముల రచించెను. వానినే పండితరాయ శకములని చెప్పుచుందురు. ఆ శ్లోకములు తఱచు ప్రస్తానోచితముగా నుండును. వానిలోఁ గొన్నిటిం జదివెద నాకర్ణింపుము.

శ్లో॥ యేవర్దితాః కరికపోలమదేన భృంగాః
     ప్రోత్ఫుల్ల పంకజరజస్సురభీకృతాంగాః
     డే సాంప్రతం ప్రతిదినం గమయంతి కాలం
     నింబేషు చార్కకుసుమేషుచ దైవయోగాత్.

వికసించిన పద్మములయందును కరికపోలమదముల యందును సంతుష్టి నొందెడు తుమ్మెద లిప్పుడు దైవయోగంబున వేఁపచెట్ల యందును జిల్లేడుచెట్ల యందును సంచరించుచున్నవి. ఇది తన స్థితిననుసరించి చెప్పినది. మఱియు -

శ్లో॥ రాత్రిర్గమిష్యతి చప్రభాతం భాస్వాన దేష్య
     తిహసిష్యతి పంకజంచ ఇత్దం విచింతయతి కోశిగతె
     ద్విరేపే హా హంతి నళినీం గజ ఉజ్జహార॥

రాత్రి దమ్మి మొగ్గ జిక్కువడిన తుమ్మెద "తెల్ల వారును, సూర్యకిరణములచే నీ పద్మము వికసించును. నాకు బంధవిముక్తి కాఁగల" దని తలంచుచుండ నింతలో నొకయేనుగువచ్చి యా తామరను ద్రెంపి నలిపినది. అయ్యో! యెంతకష్టము ఇదియుఁ దన్ను గుఱించి రచించినదే. మఱియు -

శ్లో॥ పురాసరసిమానసే వికచసారసాళిస్ఖల
     త్పరాగసురభీకృతేపయసియస్య యాతంవయః
     సపల్వలజలేధునామిళదనేక భేకాకులే
     మరాళకులనాయకఃకధయ రేకదం వర్తతాం॥

పూర్వము మానససరస్సునందు సంచరించు హంసము ఇప్పుడు కప్పలచే వ్యాప్తమగు నల్పసరస్సులోఁ దిరుగుచున్నది. అక్కటా తన యవస్థ యలతిఁగా నున్నదని దీనను సూచించెను. మఱియొకచోట నొకలేడింజూచి శ్లోకము.

శ్లో॥ యద్రక్త్వం ముహురీక్షసే నధనినాం బ్రూషే నచాటున్మృషా
     నైషాం గర్వవచః శృణోషి నచతాన్ ప్రత్యాళయో ధావసి
     కాలే బాలతృణాని భాదసి సదా నిద్రాసి నిద్రాగమె
     తన్మే బ్రూహి కురంగ కుత్ర భవతా కిన్నామ తప్తంతపః॥

ఓ కురంగమా ! నీవు ధనమునందలి యాశచే ధనికుల మొగములు పలు