పుట:కాశీమజిలీకథలు -04.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఢిల్లీ పాదుషాగారి కథ

59

భ - ఏమిచేయుటకు మనము స్వతంత్రులమా? నే నతిత్వరగా వచ్చి యా వార్త లవంగికిం జెప్పితిని. కాని యాబోఁటి నా మాట పాటించినదికాదు.

భా -- ఏమిటికో బ్రతుకఁదలచుకొనలేదు కాఁబోలు?

భ - భర్తకు వార్తనంపినదఁట. అతనిజాడ యేమియుం దెలియలేదని విచారించుచున్నది. అట్టి సమయమున నేనుబోయి చెప్పితిని. నా మాటయే వినఁబడలేదు.

భా - అయ్యో? తెలియునట్లు చెప్పలేకపోయితిరా?

భ - ఎంతచెప్పినను దెలియనిదే యేమిచేయుదును. దాని బుద్ధియంతయు వానియందే యున్నది. వలపు వివేకము నశింపఁజేయునుగదా.

భా - తరువాత నేమిజేసితిరి ?

భ - దానిదగ్గరనున్న చిన్నదానితోఁ జెప్పివచ్చితిని.

భా - అది యేమన్నది?

భ - ఆబోఁటి నా మాటలువిని యురముపైఁ జేయిడికొని యట్టె నిలువంబడి యేదియో ధ్యానించెను.

భా - తరువాత?

భ - రహస్య ప్రభేదమువలన రాజువలన నేమిమోసమువచ్చునో యని నే నందుండ వెఱచి యింటికి వచ్చితిని.

భా - తరువాత నేమిజరిగినది?

భ - ఆ మూఁడవనాఁడు మఱల నచ్చటికిఁ బోయితిని. లవంగి కనంబడ లేదు. విమర్శింపఁ బూర్వదివసం బర్ధరాత్రంబున గూఢచారులు వచ్చి నిద్రించుచుండ లవంగిం జంపి కందకములో నఁడగఁ ద్రొక్కిరని యొకదాది చెప్పినది.

భా - హరిహరీ! హరిహరీ! ఎంతమాట వింటిని. (అని పెద్ద యెలుంగున నేడువఁ దొడంగినది.)

భ - అయ్యో మూర్ఖురాల వగుచుంటివేమి చెప్పినం దెలియదా. అదియునుం గాక యిది పరమ రహస్యము నేనుగాక యితరు లెఱుఁగరు. కాలగతినతిక్రమింప నెవ్వరిశక్యము. (అని యూరడించెను.)

భా - (కన్నీరు దుడిచికొని గద్గదస్వరముతో) నాథా ! మన మా లవంగికిఁ దిలోదకము లీయవలయునుసుఁడీ.

భ - పెంచినందులకా ?

భా - కాదు. కన్నందులకే.

భ - ఎట్లు ?

భా – ఇందొక రహస్యమున్నది. వినుఁడు. మీ యుపదేశంబునంగదా పెద్దబ్బీబికి సంతానము నిలిచినది. ఆ శిశువు జనించినతోడనే మనయొద్ద నుంచుటకు