పుట:కాశీమజిలీకథలు -04.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

54

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

సఖు - స్వామీ ! స్వప్నములో జరిగిన చర్యలు కొన్ని ప్రత్యక్షముగాఁ గనబడుచుండును.

ఫాదు - (ఇంచుకవిమర్శించి దుస్తులదెసఁజూచుచు) ఇదిగో నిన్నఁ బరిచారకుఁడీ యంగీ నందిచ్చుచుండ గ్రిందఁజారిపడిన ధూళి యైనది. ఆమచ్చ సైతముఁ గనంబడుచున్నది. చూడుఁడు ఇవన్నియు స్వప్నములనిన నెట్లు నమ్ముదును.

సఖు — దేవరా! అవియన్నియు స్వప్నములే. వాకిటికివచ్చి చూడుఁడు ఎండ గాయుచున్నది.

ఫాదు - చాలుఁజాలు. ఈయెండ లన్నియుఁ బూటకములే. అదివఱకును జూచితిని.

సఖు - పోనిండు. మొగసాల, వీరభటుల, ప్రధానులు, సేనాధి పతులు, నాయోధనంబుస కాజ్ఞయిమ్మని కోరుచు దేవరదర్శనం బభిలషించి యున్న వారు వారింజూచియైన నిది జాగ్రదవస్థయని తెలిసికొనరాదా ?

ఫాదు - బుద్దివచ్చినది. ఇంకనెన్నఁడు నక్కఱమాలిన పనుల జోలికిఁ బోవను. ఇప్పుడు పోరుమానిపించి సేనలతో మనమింటికిఁపోవలసినదే. స్వామిభక్తులకు నేనట్లు దానపట్ట వ్రాసియిచ్చితిని.

సఖు - అదిమాకును సమ్మతమే నిదర్శనమునకుఁ జెప్పితిమి.

ఫాదు - అయ్యో? మఱల విభ్రాంతిపడుచుంటిని. ఈప్రసంగ మంతయుఁ గలలోనిదే యని నాయభిప్రాయము ఇదియే స్వప్నములో స్వప్నమని చెప్పఁదగినది.

సఖు - కాదు. దేవరా! కాదు ఓలగంబున కరిగి విచారింపుడు యందున్న సభాభవనమున కరిగి కొలువుదీర్చి తనరహస్యవిశేషంబు లెవ్వరికిం జెప్పక యోధుల కాయోధనము వలదని నియమించి యా రాత్రియే ప్రయాణసన్నాహము గావించి సకలపరివారములతో ఢిల్లీ పురంబునకరిగెను. పిమ్మటఁ గాశీపట్టణప్రజలెల్లఁ గాశీరాజు నగ్రాసనాధిపతిగాఁజేసి యొకసభఁజేసిరి. ఆమహాసభలోఁ బండితరాయలకు మహావీరుండని బిరుదిచ్చి యతండు ఫాదుషాచక్రవర్తిని జెఱబెట్టి బుచ్చికొనిన పత్రికఁ జదివి పెక్కు తెఱంగుల నతనియశము స్తోత్రములు గావించిరి. మఱియు విశ్వేశ్వర మహాలింగమును బంచములు తక్క తదితరు లెవ్వరు ముట్టినను దోషములేనట్లుగా నప్పుడే యాలింగమునకు మహాదీక్షాతంత్రము జరిగించి యాగమముఁ గావించిరి. నాటంగోలె నమ్మహాలింగమున కన్నిజాతులవారును గర్భాలయములోనికిం జని యభిషేకాద్యర్చనలు గావించుచుందురు. ఇదియే దీనివృత్తాంతము. గోపా! వింటివికద. ఈకథ చక్కగానున్నదియా? నీవును బోయి యామహాలింగమున కభిషేకముఁ గావించి కృతార్థుడ వయ్యదవులే యని పలికిన విని పరమానందభరితహృదయుండై యా గోపనందనుం డిట్లనెయె.