పుట:కాశీమజిలీకథలు -04.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

52

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

వారని యొప్పుకొనునా? పశ్చాత్తాపముఁ జెందుచున్నాఁడా? ఏమరక సంతతముగాఁచుచుండిరిగద్. అచ్చటి విశేషములెట్టివి? ఇచ్చట కేమిటికి వచ్చినా రనియడిగిన వాండ్రు నమస్కరించుచు నిట్లనిరి.

స్వామీ! బోనునంబెట్టిన సింగంబు చెప్పిన తెఱంగున వినక యేమి జేసెడిని? మొదటఁదన రాక గుఱించి పెక్కు తెఱంగులఁ దలపోసి మమ్మడిగెను. మేమిది నరకమనియు నీవు దేవతాద్రోహముఁ గావించితివి గావున నిందు బడవై చితి మనియు మేము స్వామికి భక్తులమనియుం జెప్పితిమి. అప్పటినుండి మాయెడ వినయము జూపుచు మాయుపచారములఁ గైకొనుచుండెను. ప్రతిదినముఁ దన్నుఁ దన దేశమునకుఁ బంపమని మమ్ముఁబ్రార్ధించుచుండును. ఇంకెన్నడును హిందూదేవతలజోలికి రాఁడఁట. విశ్వనాథస్వామికి గొన్నిగ్రామములు కానుకగా నిత్తునని చెప్పుచున్నాడు. అట్లొడంబడిక వ్రాసి యిచ్చెను. పెక్కేల మేమెట్లు చెప్పిన నట్లునడుచుటకు సమ్మతించునఁట అని క్షణక్షణములను సలాములు చేయుచుఁ జెప్పుచుండును. మేమును మఱికొన్ని దినములు పోనిమ్మని చెప్పితిమి. ఇప్పటికి నెలకా వచ్చినది. మీ యాజ్ఞానుసారము చేయుచున్నాను. తరువాత దేవరయే ప్రమాణమని చెప్పిరి.

మరియొకనాఁడు రాత్రి వీరుండు మంచి సమయమును విదారించి మునుపటి ద్రావక విశేషమున నిద్రించుచున్న యతనికి మత్తుగలుగఁజేసి పూర్వము వలనే యెత్తుకొని యాతెరు వితరులకులం జెప్పక యెక్కఁడ యాగుప్తమార్గంబున లవంగి యంతఃపురమునకుంజని యందొక తల్పంబునఁ జక్రవర్తిని బరుండబెట్టి కొంతసేపానెలంతతో ముచ్చటించి తెల్లవారకమున్న యెప్పటియట్ల కాశీపురంబునకుఁ జనియెను.

పాదుషా చక్రవర్తి మఱునాఁడుదయంబునలేచి కన్నులందెఱచి నలుదెసలం బరికించుచు నోహో! ఇది మునుపటి గుహ కానియట్లున్నది. స్వామిభక్తులకు నిన్న దానపత్రిక వ్రాసియిచ్చితిని గద.

నేఁడు బంధవిముక్తుండనైతి. ఇది మదియాంతఃపురము కావచ్చుననితలంచుచు నెవ్వరెక్కడ యని వడిగాబిల్చెను. ఆధ్వనివిని యంతకుమున్న బోధింపఁబడియున్న చెలికత్తియు లిరువురు నిదిగో మేము వచ్చుచున్నామని పలుకుచు నా గదిలోనికింబోయిరి. వారింజూచి చక్రవర్తి యీ యిల్లెవరిది? మీ రెవ్వనివారలు? నేనిక్కడి కెట్లు వచ్చితిని? ఇంతకు బూర్వ మెందుంటినో మీరెఱుంగుదురా యని యడిగిన నా చేడియలు చేతులజోడించి యిట్లనిరి. స్వామీ! మీరు నెలక్రిందట మీ యంతఃపురములో శయనించియుండి యొకనాఁడు రాత్రి పలవరించిరి. అప్పుడు మిమ్ముఁ బరిచారకు లెంతలేపినను లేచితిరికారు. దానికిం జడియుచు రాజపుత్రిక యచ్చిటినుండి తన మేడమీఁదికి దీసికొని రమ్మని చెప్పిన మేమిచ్చటికిఁ దీసికొనివచ్చి యీ గదిలో నీ తల్పముమీఁదఁ బరుండబెట్టితిమి. అప్పటినుండి మీరూరక నిద్రపోవ