పుట:కాశీమజిలీకథలు -04.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఢిల్లీ పాదుషాగారి కథ

51

వీరు - ఆపాతకము నన్నంటలేదా ?

లవంగి - ఎట్లు ?

వీరు - నీ వలన.

లవంగి - నేను పరస్త్రీనా ?

వీరు - కాక.

లవంగి - ఓహో! ఇదియా మీ యభిప్రాయము. నేను వెలయాలి ననుకొంటిరాయేమి? బాగు! బాగు! భళి! భళి! లెస్సగా నున్నది. స్వైరిణీవృత్తి నా యందులేదు.

వీరు - నీ వనుకొనుచుంటివి కాఁబోలు.

లవంగి - మీరే యాలోచించి చెప్పుడు. మీరు విశ్వేశ్వరసాక్షి నాపాణిగ్రహణము చేయలేదా? అప్పుడే త్రికరణముల చేతను మిమ్ము భర్తగాఁ దలంచితిని. దానంజేసియే మీకొఱ కిన్ని పాటులు పడుచుంటినిగాని మీపాటి విటపురుషుఁడు దొరకక కాదు.

వీరు — బ్రాహ్మణులు తురక నెలఁతుకలఁ బెండ్లి యాడినట్లే పురాణములో నైనఁ జెప్పంబడియున్నదా ?

లవంగి - పంచముల దక్కఁ దక్కిన సర్వవర్ణముల వారిం బ్రాహ్మణులు పెండ్లియాడవచ్చునని ధర్మశాస్త్రములో నున్నది.

వీరు — సర్వశబ్దములో యవనులు సేరరు.

లవంగి - చేరకమానరు. బలవంతమునైనం జేరుదురని పలుకుచు సిగ్గు విడిచి దిగ్గున నగ్గరిత యతని గౌగలించుకొనబోవ. అప్పుడతం డాత్మగతంబున -

గీ. కులముపోయినఁ బోఁగాక వెలిపడంగ
   బుధులు నవ్వినఁ దెలిసి నవ్వుదురుగాక
   యశము చెడినను జెడుఁగాక యాప్తవితతి
   విడుచుఁగాక నెలంత నేవిడువనేర.

చ. సకల కళారహస్యములఁ జక్క నెఱింగినప్రోడ మేల్ నెలం
    తుక సుగుణాలవాల సుమనోహరరూప వినూత్న యౌవన
    ప్రకట కలాకలాపయగు భామిని కోరి తనంతవచ్చి కౌ
    తుకమునఁ బై కొనంగ మఱి త్రోయవశంబె పినాకపాణికిన్.

అని తలంచుచు నవ్విరించికులవతంసుండు నయ్యండజనేత్రతోఁ గ్రీడాసుఖపారవశ్యంబున గడిపి యుదయంబుకాకమున్న యథాగతముగాఁ గాశీపురంబున కరిగెను. అంతకుమున్న యతనిరాక వేచియందున్న కొందఱుపచారకులం జూచి యతండిట్లనియె. యోధులారా చక్రవర్తి సుఖుండై యున్నవాడా? రాజోపచారములు చేయుచున్నారా ఏమనుచున్నాఁడు? ఇప్పటికైన హిందువుల దైవములు నోరు కల