పుట:కాశీమజిలీకథలు -04.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6]

లవంగికథ

41

బునఁ దమసేన రెండు తెగలగాఁ జేసికొని కాశీపురి కుత్తరదక్షణభాగంబుల నాక్రమింప నడిపింపఁ జొచ్చిరి అత్తెఱ గరసి వీరుండు రౌద్రావేశముతోఁ దనదళముల నుత్తరముగా వచ్చు బలమున కడ్డముగాఁ బోవనియమించి తాను దక్షిణభాగంబునంగల వాహినులకడ్డమై చిత్రయుద్దంబుఁ గావించి యాబలము నెల్లఁ దృటికాలములోఁ బీనుగుపెంటలు గావించెను.

ఇంతలో నుత్తరదిశ కరిగిన యవనసైన్యము హిందూబలంబుల మీఱి పార దోలి మేరమీఱిన కడలివలె నగరిలోఁ బ్రవేశించి వ్యూహంబులఁ బటాపంచలు గావింపఁ దొడఁగెను. అప్పుడు వీరుండు పౌరుషమే పారం బారిపోవుచున్న తనబలమున కుత్సాహముఁ గలిగించుచు రెండవపెడ కరిగి వ్యూహముల భేదించు యవనసైన్యముల లేళ్ళగముల బెబ్బులిపోలికఁ గోటనికటంబువఱకుఁ దఱిమివచ్చి తన వ్యూహంబుల యథాగతి గవనులు నిలువఁజేసెను.

ఆరాత్రి యవనసేనానాయకు లెల్ల నొక్కచోఁ జేరి వీరుండు తురగమెక్కి సంగరము చేయుచుండఁ బుడమియంతయు నేకమైవచ్చినను వాని గెలువలేదు. వానిఁ గుఱ్ఱమునుండి నేలంబడు నుపాయమరయవలయు. ఇప్పని రోహిలాలు సేయ నోపుదురు. వారు తఱచు నుచ్చుత్రాళ్ళతోఁ బోరుసేయుదును గదా. ఆ త్రాళ్ళు రణభూమి నెడనెడఁ గట్టంచినచోఁ బాదంబులకుం దగిలికొని తురగంబు నేలంగూలఁ గలదు. దానంజేసి యతండు పట్టికొన సాధ్యుండగు నిదియే యుపాయ మంతకన్న వేఱొక సాధనంబునఁ గార్యంబు కొనసాగదని యాలోచించి రోహిలాలకు మఱునాటియుద్ధములో నట్లుచేయ నియమించిరి.

రోహిలా లారాత్రియే యుద్దభూమిలో నందందు శంకులుపాతి వానికుచ్చు త్రాళ్ళంగట్టి కాచుచుండిరి. ఆ దినమున ఫకీరులు యవనసేనలోనికి వచ్చుటకు సమయము దొరికినదికాదు. కావున నా రహస్యము వీరికిం దెలిసినదికాదు. మూడవనాఁడు ప్రాతఃకాలంబున యవన సేనానాయకులు తమసేనల నెల్ల నొక్క గుమిగా నడిపించుచుఁ గాశీపురంబు నడిభాగముపైఁ బడఁదలచుకొనిరి. అంతలో వీరుండు బలములతో వారి నెదిరించెను. ఇరుబలములకు ఘోరయుద్ధము జరిగినది. పురుషకారము దైవమును మీఱలేదుగదా? ఇంతలో వీరుం డతివేగంబున వాఱువమును నడిపించుచుఁ బరబలంబుల మర్దించుచుండ నొకచోట నాఘోటకము పాదమున కొకయురిత్రాడు తగిలికొనినది. దానంజేసి యది నేలవ్రాలినంత నతం దావిసురునఁ బదిబారల దూరమునఁ బుడమిం బడియెను.

అప్పుడా ప్రాంతమందుఁ గాచియున్న యవనసేనులు తటాలున వానింబట్టుకొని యాయుధంబులు లాగికొని గొలుసులతో బంధించి ------------మును హిందూబలంబులపైఁబడి భందనంబుగావించి-------.