పుట:కాశీమజిలీకథలు -04.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

38

కాశీమజిలీ కథలు

తండ్రితోఁ జెప్పి యాయనను నాయొద్ద బండితునిగా నుంచుకొనగలను. నిన్నుఁ జూచినదిమొదలు నాకట్టితలంపు గలుగుచున్నదని యనేక ప్రియాలాపములు పలికి యంపినది

అతం డరిగినవెనుక లవంగి కొంతతడ నాదెసం జూచుచు మిన్ను వంక మొగంబై యెద్దియో యాలోచించుచుండెను అప్పుడు కుందలతిలక 'సఖీ! మాటాడక యూరక యెద్దియో ధ్యానించుచుంటిని. ఆ విషయము మా కెరింగింపరాదా' యని యడిగిన నప్పఁడతి నిట్టూర్పు నిగుడించుచు, 'ఎందుబోయితివి? మల్లిక యెవరో యెఱుందువ? ఏమిచేసినదో చూచితివా' యని పలికిన నది యిట్లనియె. 'అట్లడిగెదవేల? మల్లిక వీరునిచెల్లెలని చెప్పినదికాదా! ఏమిచేసిపోయినది? మీరెద్దియో రహస్యములు మాటాడుదురని దూరముగాఁ బోయితిమి. ఏమిజరిగినదో చెప్పు' మని యడిగిన నవ్వనిత వీరుండే యీవేషము వైచుకొని వచ్చెను. నేను మొదట గ్రహింపలేక పోయితిని. చెల్లెలు గనుక పోలిక వచ్చినదనుకొంటిని. వెళ్ళబోవు సమయమున తెలిసినది. అతండప్పుడు పురుషచర్యలం గావించెనని చెప్పినది. కుందలతిలక అయ్యో! ఇంచుక నాకు శూచింతివేని గుట్టు బయల్పెట్టక పోవుదునా? ఎంతపని చేసితివి? దూరముగానుండి యెన్నియో చెప్పితివే? మఱి యప్పు డేమిచేసితివని యడిగిన లవంగి నాకు వణఁకు వచ్చినది. దానంజేసి యేమాటయు వచ్చినదికాదు. ఏమాట పలుకుటకును దోచినది కాదు. ఒకటిచెప్పఁబోయి యొకటి చెప్పితిని సీ! యీ సిగ్గు నన్నగపఱచుకొనినది. ఎఱుంగనట్లే మాటాడితిని కాని చేయిపట్టుకొని నీవిట్టిరూపమున వచ్చి మమ్ము వంచింతువా యని యడిగిననేమి చెప్పునో, తెలిసిన పిమ్మటి నేమి చేయునో వానికి నామనసు తెలియకపోవుటచే నన్నిపోకలం బోయెను.

అప్పుడైన స్పష్టపఱచితినా? వెఱ్రిమాటలం జెప్పితినని పాశ్చాత్తాపముఁ జెందుచున్న యారాజపుత్రిక నూరడించుచు సఖురాండ్రిట్లనిరి. 'బోటీ! యిప్పుడు మించినదేమియును లేదు. తిరుగా దెల్లవారదా? అతండు నీయందు బద్ధానురాగుండైనట్లు తెల్లమైనదికదా? ఇఁకముందు మదను డే యదను జెప్పెను. విచారింపకు "మని పలికిరి. ఆరాత్రి యంతయు నక్కాంత యతని మాటలు చూపులు చేతలు తలంచుకొనుచు నిద్రబోయినదికాదు.

అంత మఱునాడు ఫకీరులు యవనసేనావిశేషములం దెలిసికొని వచ్చి వీరునితో రహస్యముగా నిట్లనిరి. "అప్పా! నీశౌర్యము మిగులఁ గొనియాడఁదగియున్నది. రాజపుత్రికనే చెఱదెచ్చితివఁట. ఎంతమోసమోకదా? మంత్రి యిప్పుడు మిగుల విచారించుచున్నాఁడు. నీవు మాకుఁ బరిచితుఁడవని యెఱుఁగడు. ఆమెను జంపుదురని వెఱచుచున్నాఁడు. పాదుషాగారి యానతిలేనిదే యింటికిఁ బయనముఁ జేయించెనఁట. ఈవార్తవిని పాదుషా యతనికి శిరచ్ఛేదము చేయించునని యడలుచున్నాడు. సంధి కిదియే సమయము. ఆ రాజపుత్రికను జీవములతోఁ దనకిచ్చెనేని మన మనిన నిబంధ