పుట:కాశీమజిలీకథలు -04.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లవంగికథ

37

అప్పుడు లవంగి “మల్లికా! దానంజేసియే కాబోలు మీ యన్న పేరు వినినంత నాకు మనంబున నెద్దియో యానందము గలుగుచుండును. ప్రీతికి నుపాధువులు కావుసుమీ. ఇప్పుడు మీ యన్న యెక్కుడువానితోఁ దగనిపగఁ దెచ్చి పెట్టుకొనియెను. అదియునుంగాక నన్నుఁ జెఱబట్టినవార్త వినినంత మా తండ్రి వుడమి నిలువనిచ్చునా? ఆయనకుఁ బాండిత్యము చాలదా? పాఱలకుఁ బౌరుష మేమిటికి? ఇప్పటికైనం దప్పించుకొనిపోయిన నొప్పిదముగా నుండును. నీ కంఠధ్వని మీ యన్న కంఠధ్వని యొక్కటేసుమీ" యని పలికిస విని యక్కలికి యిట్లనియె. 'బోటీ యీ మాటయే పలుమారు మా తండ్రి వీరునితోఁ జెప్పుచుండును. వాఁడువినక సంగరాభిలాషియై యున్నవాడు. ఏమిచేయుదుము. నీవనిన వాని కిష్టమే సుమీ! మొన్న మాటల ధోరణిని గహించితి' ననుటయు నయ్యువతి మఱల నిట్లనియె.

“వనితా! నామాట యతం డేమిటికిఁ దెచ్చెను? నాయందిష్టమని యెట్లు గ్రహించితివి? నిజముగా నప్పు డేమిప్రశంస వచ్చినదో చెప్పు" మని యడిగిన నవ్వుచు నతం డవ్వనిత కిట్లనియె. కాంతా అంతగా నడుగుచుంటివేల? మఱియేమియును లేదు. ఈముప్పునకు హేతుభూతురాలవని నిన్నెవరో నిందించిరి. అందుల కతండు సమ్మతింపక నీపాండిత్యమును గుఱించి భూషించుచు నీతండ్రిని దూషించెను. నీరూప మా సేచనకమని యెద్దియో ప్రశంసలమీఁదఁ గొనియాడెను. ప్రొద్దుపోయినది. ఇఁక నేను బోయివత్తు ననుజ్ఞ యిత్తువా' యని యడిగిన నచ్చేడియ యిట్లనియె.

'బోటీ! నీమాటలచే నాదుఃఖము మఱచిపోయితిని. చెఱదెచ్చియు నవమానపఱుపక గౌరవముగాఁ గాపాడుచుండెడు మీయన్న కనేక నమస్కారములని చెప్పుము. ఈపగ విడచి మైత్రిగలిగి వర్తింపుమనియు నీయాపద దాటించుకొను తెరు వరసియుండుమనియు నుడువుము. దయజూచుచుండుమని పెక్కుమాటలు సెప్పి యరుగునప్పుడు మల్లికయే వీరుడను సందియము గలిగి యది కులాచారమని తెలుపుచు నచ్చెలువ యతని చెక్కుల ముద్దుపెట్టుకొనినది. అతండు తత్స్పర్శసుఖంబున మేను పరవశముజెంద నాసుందరి వా తెరుపుడికి వగలాడి తనంబున జిట్టకంబులు గావించిన నదరుచు నమ్మందగమున యతని నట్టెచూచుచు 'నిట్టి చిట్టకము లాఁడువాం డ్రాఁడువాండ్రయెడఁ గనఁబఱతురా? పండితుని చెల్లెలవు కాబట్టియా నీవలన వింతలం గంటినని యుల్లసమాడుటయు నది తమ కులాచారమగుటఁ జేయనయ్యె నీచేతలుమాత్రము విపరీతములు కావా' యని యుత్తరము జెప్పెను. పిమ్మటనతం డతివా! ప్రొద్దుపోయినది. నేను వచ్చి పెద్దతడవైనది. నీ మాటలతీపునకుఁ జొక్కి యొడలెఱుంగ నైతిని. పోయివత్తు నాజ్ఞయిమ్మని పలికిన నక్కలికి మేమనవలసినమాట నీవనుచుంటివి. కానిమ్ము. వెండియుఁ దర్శనమియ్యఁ గోరుచున్నదాన. మీ యన్నగారితోఁ దగని పగ పెట్టుకొనవలదని పలుమఱు బోధింపుము. బంధనంబునకు వెఱచి చెప్పిన మాటగాఁ దలంపవలదు తమ మేలుకొఱకే చెప్పితిని. ఈ ముప్పు దాటినచొ మా