పుట:కాశీమజిలీకథలు -04.pdf/326

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కళావతీసుందరుల కథ

333

నీ యొద్దకు వచ్చితిమి. మా కామితంబు దీరుతునంటివేని చెప్పుదుమనుటయు నతండందలిపట్టి యార్యులారా : మీకు నేను బుత్రునివంటివాఁడ. మీ కార్యంబెట్టిదయినను దీర్చి మీకు మురిపెము గలుగఁ జేసెద. సంశయింపక నుడువుఁడని పలికిన వారిట్లనిరి.

మేము చిరకాలమునుండి యీదివాణము నాశ్రయించి కాలక్షేపము చేయుచున్నాము. మా పేరు పెట్టుకొని యెవ్వరో మలయధ్వజుని యాస్థానమున కరుదెంచి నీతోఁ బ్రసంగించి పరాజితులై రని వింటిమి అందలి నిజం బరము తలంపుతో మా రాజు నిన్నిందు రప్పించెనఁట. రాజులకేమి ? కోడి పందెములఁగట్టి వినోదించు కోడె గాండ్రవలె మనలో మనకుఁ గలహములు గల్పించి యానందించుచుందురు. జయాప జయంబులు దైవా యుత్తములు గదా.

నీవు మంచిపరువములో నుంటివి. నీకు మేమోడిపోయితిమేని మాభూక్తులకు లోపమురాఁగలదు. ఒకరికిఁ గీడుగావించి వడసిన విత్తంబుత్తమ మైనదా ? కావున నొరులకుఁ జెప్పకుండ నీ విక్కడి నుండి యవ్వలికి బోయి మమ్ము గాపాడుము. ఇదియే మా కోరికయని పలికిన నతండు నవ్వుచు నిట్లనియె.

ఆర్యులారా ! యవశ్యము మీ కోరిక ప్రకారము కావించెదఁ గాని నా కడ నింకను గపటముగా మాట్లాడుచున్నారు. అది యుచితము కాదు. నాఁడు మలయధ్వజుని యాస్థానమున కరుదెంచినవారు మీరదురు కారా ? నిక్కము చెప్పుఁడనియడు గుటయు వారు బాలకా ! మా నోటితో నేమిటికిఁ జెప్పించెదవు ? పెద్దలము గదా మమ్మింతటితో విడిచి పెట్టుమని కోరిరి.

అట్టి సమయమునఁ బ్రచ్ఛన్నముగా నుండి తత్సంభాషణ లన్నియు వినుచున్న కృష్ణదేవరాయలు సంతోషము పట్టఁజాలక యా లోపలికి వచ్చి తటాలున నా బాలుం గౌఁగిలించుకొనియెను. అతండు రాజని తెలిసికొని పండితులలెల్లఁ దెల్ల పోయి చూచుచుండిరి. అప్పుడు రాయలవారు ఒహో ! యీతఁ డెవడో తెలియక మీరువెఱిచి వీనిని శరణుజొచ్చితిరి. వినుండితండు మన రామలింగకవి కుమారుండువసుంధరుఁడు నుండియని చెప్పినంత లేచి రామలింగకవి యేమేమీ ! వీఁడు మావసుంధరుఁడా యని పలుకుచు వానిం గ్రుచ్చి యెత్తికన్నుల నానంద బాష్పములు గ్రమ్మ దండ్రీ ! ఇంత కాల మెదుంటివి ? మమ్ము మఱచి వెఱపింప వచ్చితివా ? అయ్యో మీతల్లి నీకొఱకుఁ జింతించుచు మంచము పట్టినది. పట్టీ ! నీ వంతలో నెట్లు అంతర్ధాన మయితివి ? నీ