పుట:కాశీమజిలీకథలు -04.pdf/325

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

332

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

కళా - ఏమనుకొని యెదరు ? సమసితిమని విరక్తులయి యుండెదరు. వసుంధరా : నాకు మా దల్లిదండ్రుల వేగఁబోయి చూడవలయునని యున్నది. రేపు పోపువునా ?

వసుం - అశ్యము పోవచ్చును. అంతఃపురమున బ్రవేశింతువుకాఁబోలు నన్నెప్పుడయిన స్మరింతువా ?

కళా — నా హృదయమే నీ యొద్దనుంచి పోవుచున్నాను. అట్లనియెద వేల ?

వసుం - మణిదిగ్దంతుల ప్రసంగ ప్రకారములాకిర్ణించిపోవవా.

కళా - స్వ గ్రామమున సభకుఁబోవుట యుచితము కాదు. తరువాత నంతయు విందుము కాదా ?

వసుం - పోనిమ్ము కౌముదిం బెండిలియాడు విషయమై పండితులతోఁ బ్రసగించి పొమ్ము వారేమి చెప్పుదురో చూతము.

కళా - రెండు వాదములు నీవే చేయఁగలవు. వాదింపనేమి యున్నది. మేమిరువురము నీ దాసురాండ్ర మయితిమి. మఱియు మా కాల్లి చేసిన యపరాధము మఱువవలయునని మిమ్ము వేడుకొనుచున్న దాన.

వసుంధరుడు - మీ తల్లి నాకొక్కనికే యపకారము చేయలేదు మనయిరువులకుఁ జేసినది కాదా ? అదిగొ పండితులు వచ్చుచున్నారు మాటాడకుము.

కళా - వీరి రాకకు గతంబేమియో ?

వసుం - ఏమున్నది ? పిరికితనమే.

అని మాట్లాడికొనుచుండఁగనే తదనుజ్ఞగై కొని యా విద్వాంసులు లోపలికి వచ్చిరి. వసుంధరుండందఱికి నమస్కరించి వారినుచిత పీఠంబులం గూర్చుండఁ బెట్టెను. అప్పుడు వారాశీర్వాదము చేయుచు నక్షత లతనిశిరంబున వై చిరి. అప్పుడు వసుంధరుఁ డార్యులారా ! అమోఘంబైన బ్రాహ్మణాశీర్వాదము స్వీకరించిమీరందఱు లోకాతీతులు. ఇట్టి యర్దరాత్రమున నాకడకు రాఁ గతంబేమియో యెఱింగింపుఁడని యడిగినఁ బెద్దనార్యుం డిట్లనియె.

పండితకంఠీరవా ! నీవు విద్యచే నధికుండవైనను బ్రాయంబున మాకంటెఁ జిన్నవాఁడవు కావున నాశీర్వచన పాత్రుండ వయితివి. మా కొక కార్యంబు గలిగియే